ఆనియన్ పరోటా | ONIAN parotaa Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  8th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • ONIAN parotaa recipe in Telugu,ఆనియన్ పరోటా, Kavitha Perumareddy
ఆనియన్ పరోటాby Kavitha Perumareddy
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

ఆనియన్ పరోటా వంటకం

ఆనియన్ పరోటా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make ONIAN parotaa Recipe in Telugu )

 • గోధుమ పిండి పావుకేజీ
 • ఉల్లిపాయలు పావుకేజీ
 • పచ్చిమిర్చి 5
 • కొత్తిమీర ఒక కట్ట
 • కారం సగం స్పున్
 • ఉప్పు తగినంత
 • ధనియాలపొడి స్పున్
 • జీలకర్ర పొడి స్పున్
 • నిమ్మకాయ 1
 • ఉప్పు తగినంత
 • నూనె పరాటాలు కాల్చడానికి సరిపడా

ఆనియన్ పరోటా | How to make ONIAN parotaa Recipe in Telugu

 1. ముందుగా గోధుమ పిండి ,కొంచెం ఉప్పు,స్పున్ నూనె వేసి తగినంత నీళ్లు కలిపి చెప్పాతి పిండి లాగా కలిపి ఒక 10 నిముసాలు నాననివ్వాలి.
 2. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా తరిగి ఒక గిన్నెలో తీసుకొని ఉప్పు,కారం,ధనియాలపొడి, జీలకర్ర పొడి,నిమ్మకాయ రసం స్పున్ వేసి అంతా బాగా కలుపుకోవాలి.
 3. ఇప్పుడు పరోటా పిండి కొద్దిగా తీసుకొని ఒత్తుడు పిండి వేసుకొని చిన్నపూరీ లా వత్తుకొని ఉల్లిపాయలు మసాలా వేసి పిండిమొత్తం మూసి ఎక్కువ బలంగా కాకుండా చిన్నగా వత్తుకుంటూ పరోటా రుద్దుకోవాలి.
 4. ఇప్పుడు పరోటా ని పెనంపై వేసి రెండువైపులా తిప్పుతూ నూనె వేసి మాడిపోకుండా కాల్చుకోవాలి.
 5. ఇంకా వేడి వేడి పరాటాలు రెడీ .పెరుగుపచ్చడి లేదా ...టమాటా సాస్ తో వడ్డించడమే... :blush:

నా చిట్కా:

ఉల్లిపాయలు మసాలా కలిపిన తరువాత వెంటనే పరాటాలు చేసుకోవాలి.లేదంటే ఉల్లిపాయలు నీరు ఒడిసి పరోటా సరిగ్గా రాదు.

Reviews for ONIAN parotaa Recipe in Telugu (0)