వాంగి బాత్ | Vangi bath Recipe in Telugu

ద్వారా Revathi Kumari  |  9th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Vangi bath recipe in Telugu,వాంగి బాత్, Revathi Kumari
వాంగి బాత్by Revathi Kumari
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

వాంగి బాత్ వంటకం

వాంగి బాత్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vangi bath Recipe in Telugu )

  • అన్నం వండడానికి :-
  • 225 గ్రాములు బియ్యం
  • 1/4 చెంచా ఉప్పు
  • 2 కప్పుల నీళ్లు
  • చింతపండు రసం:-
  • 1/2 చెంచా చింతపండు
  • 1/4 కప్ వేడి నీళ్లు
  • వాంగి బాత్ రెసిపీ:-
  • 2 చెంచాలు నూనె
  • 1/2 చెంచా ఆవాలు
  • 1/2 చెంచా మినపప్పు
  • 2 చెంచాలు వేయించిన పల్లీలు
  • 1 రెమ్మ కరివేపాకు
  • 1/8 చెంచా ఇంగువ
  • 1-2 ఎండుమిరపకాయలు
  • 200 గ్రాములు తరిగిన వంకాయలు
  • 1/4 చెంచా పసుపు
  • 2 చెంచాలు వాంగిబాత్ మసాలా
  • ఉప్పు తగినంత
  • 1/2 చెంచా బెల్లం
  • 2-3 చెంచాలు తరిగిన కొత్తిమీర

వాంగి బాత్ | How to make Vangi bath Recipe in Telugu

  1. ముందుగా బియ్యాన్ని నీళ్లలో 30 నిమిషాలు నానబెట్టుకోవాలి
  2. అరగంట తరువాత రెండు కప్పుల నీళ్లు, 1/4 చెంచా ఉప్పు నానబెట్టిన బియ్యం వేసి ౩ కూతలు వచ్చేవరకు ఉంచాలి
  3. ఇప్పుడు చింతపండుని నీళ్లలో ౩౦ నిమిషాలు నానబెట్టుకుని పల్ప్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి
  4. ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టి అందులో నూనె వేసి కాగనివ్వాలి
  5. అందులో ఆవాలు ,మినపప్పు, పల్లీలు వేసి వేయించాలి
  6. వేగిన తరువాత అందులో కరివేపాకు, ఎండుమిర్చి ,ఇంగువ వేసి వేయించాలి
  7. అందులో వంకాయలు వేసి బాగా కలిపి వేయించాలి
  8. వేగిన తరువాత అందులో పసుపు ,ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  9. అందులో వాంగీబాత్ పౌడర్ వేసి వేసి బాగా కలుపుకోవాలి
  10. ఇప్పుడు అందులో చింతపండు పల్ప్ ,బెల్లం గ్రేవీ ల అయ్యే వరకు ఉడికించాలి
  11. ఇప్పుడు అందులో ఉడికిన అన్నం వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిసిన తరువాత అందులో కొత్తిమీర కూడా వేసుకోవాలి
  12. దాని రైతా, పాపడ్స్ తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది

నా చిట్కా:

నచ్చితే కొంచెం పచ్చి కొబ్బరి పొడి వేసుకోవచ్చు

Reviews for Vangi bath Recipe in Telugu (0)