BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / జీడిపప్పు కొత్తిమీర రైస్

Photo of KAAJU koriyaandar rice by Kavitha Perumareddy at BetterButter
225
2
0(0)
0

జీడిపప్పు కొత్తిమీర రైస్

Sep-11-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జీడిపప్పు కొత్తిమీర రైస్ రెసిపీ గురించి

ఈ కాజు కొత్తిమీర రైస్ చేయడం చాలా సులభం.లంచ్ బాక్స్ కి చాలా బాగా సరిపోతుంది. పిల్లలు రకరకాలు కూరలు చేసినా తినరు. ఇలా ఒక దానిలో అన్ని పోషకాలు అందేలా చేస్తే సరిపోతుంది.:blush::relaxed:ఇలా కరివేపాకు తో ,గోంగూరతో,పుదీనా తో కూడా రకరకాల రైస్ లు చేసిపెట్టచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. ఒక పెద్ద కప్ వండిన అన్నము .పొడిపొడిగా ఉండాలి.
  2. కొత్తిమీర పెద్ద కట్ట 1
  3. జీడిపప్పు 50 గ్రామ్స్
  4. జీలకర్ర 1 స్పున్
  5. నూనె 2 స్పూన్స్
  6. కరేపాకు 2 రెమ్మలు
  7. పసుపు పావుస్పూన్
  8. ఉప్పు తగినంత
  9. పచ్చిమిర్చి 4
  10. ధనియాలపొడి1 స్పున్

సూచనలు

  1. ఈముందుగా కొత్తిమీర శుభ్రంగా కాడలతో సహా వలుచుకొని, నీటిలో ఉప్పు వేసి బాగా కడిగి మిక్షిలో వేసి పేస్ట్ చేసుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి నూనె వేసి వేడిగా ఐన తరువాత కరివేపాకు వేసి వేగిన తరువాత పక్కకు తీసుకోవాలి. అదే నూనెలో జీలకర్ర,జీడిపప్పు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి.
  3. ఇప్పుడు వేగిన పోపులో కొత్తిమీర పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు మగ్గించాలి.లేకపోతే కొత్తిమీర ఘాటు ఉంటుంది .అందుకని బాగా మగ్గించాలి.
  4. కొత్తిమీర మగ్గిన తరువాత పసుపు,తగినంత ఉప్పు ,ధనియాలపొడి వేసి కలపాలి.
  5. ఇప్పుడు కొత్తిమీర మిశ్రమంలో అన్నం వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని 5 నిముసాలు ఉంచాలి.మంట మాత్రం చిన్నగానే ఉండాలి .అప్పుడే రుచిగా వస్తుంది .
  6. ఇంకా వేడి వేడిగా జీడిపప్పు కొత్తిమీర రైస్ తయ్యార్ .వేయించిన కరివేపాకుతో అలంకరించుకోవాలి. కరేపాకు వేయించడం వల్ల అన్నం మంచి సువాసన వస్తుంది.:relaxed::ok_hand:

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర