ఉండరాళ్ళు | Undarallu Recipe in Telugu

ద్వారా Revathi Kumari  |  13th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Undarallu recipe in Telugu,ఉండరాళ్ళు, Revathi Kumari
ఉండరాళ్ళుby Revathi Kumari
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

ఉండరాళ్ళు వంటకం

ఉండరాళ్ళు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Undarallu Recipe in Telugu )

  • 1 కప్ బియ్యం రవ్వ
  • 2 కప్పుల నీళ్లు
  • 1/4 కప్ నానబెట్టిన సెనగపప్పు
  • 1/2 చెంచా జీలకర్ర
  • 1/4 చెంచా ఉప్పు
  • 1 చెంచా నెయ్యి
  • కరివేపాకు 1 రెమ్మ

ఉండరాళ్ళు | How to make Undarallu Recipe in Telugu

  1. ముందుగా బియ్యాన్ని కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి
  2. నానిన దానిని ఒక గుడ్డ మీద ఎండలో ఆరబెట్టుకోవాలి
  3. బియ్యం బాగా ఎండిపోయిన తరువాత దానిని మిక్సీ జార్ లో కి తీసుకుని రవ్వ చేసుకోవాలి
  4. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకుని అందులో పిండిని రవ్వ ని జల్లించుకోవాలి
  5. ఇప్పుడు సెనగపప్పు ని రెండు మూడు సార్లు బాగా కడిగి 10 నిమిషాలు నీళ్లునపోసి నానబెట్టుకోవాలి
  6. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నెయ్యి వేసి కరగనివ్వాలి
  7. అందులో సెనగపప్పు వేసి 2 నుంచి 3 నిమిషాలు వేయించాలి
  8. ఇప్పుడు అందులో రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి
  9. అందులో ఉప్పు కూడా వేసి ఉడికించాలి
  10. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి
  11. అందులో బియ్యం రవ్వ కలుపుకుంటూ వేసుకోవాలి
  12. అందులో జీలకర్ర కూడా వేసి బాగా కలిపి ఉడికించాలి
  13. ఇప్పుడు వాటిని ఒక వెడల్పాటి ప్లేట్ లో వేసుకుని చాలారుచుకోవాలి
  14. చల్లారిన తరువాత చేతికి నెయ్యి రాసుకుని వాటిని ఉండలు చేసుకోవాలి
  15. ఇప్పుడు వాటిని 10 నిమిషాలు స్టీమ్ చేయాలి

Reviews for Undarallu Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo