పెసర చెనగ మినప్పప్పు దోస | Multi pulses dosa Recipe in Telugu

ద్వారా Ganiprameela Ganiprameela  |  15th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Multi pulses dosa recipe in Telugu,పెసర చెనగ మినప్పప్పు దోస, Ganiprameela Ganiprameela
పెసర చెనగ మినప్పప్పు దోసby Ganiprameela Ganiprameela
 • తయారీకి సమయం

  9

  గంటలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  9

  జనం

0

0

పెసర చెనగ మినప్పప్పు దోస వంటకం

పెసర చెనగ మినప్పప్పు దోస తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Multi pulses dosa Recipe in Telugu )

 • మినపప్పు 1 కప్
 • పెసరపప్పు 1/2కప్
 • చెనగపప్పు 1/2 కప్
 • బియ్యం 3 కప్స్
 • మెంతులు 1 స్పూన్
 • చెక్కర 1/2 స్పూన్
 • ఉప్పు తగినంత
 • నూనె తగినంత
 • 1/4 కప్ అన్నం

పెసర చెనగ మినప్పప్పు దోస | How to make Multi pulses dosa Recipe in Telugu

 1. ముందుగా 3 రకాల పప్పు దినుసులు ,బియ్యం , మెంతులు కలిపి కడిగి 4 గంటలు నానపెట్టుకోవాలి
 2. నానిన తరువాత 1/4 కప్పు ఉడికించుకున్న అన్నం వేసి గ్రైండ్ చేసి 5 గంటలు పాటు పిండిని ఉండనిస్తే పొంగుతుంది
 3. తరువాత ఉప్పు, చెక్కర వేసి స్టవ్ మీద పెనం పెట్టి వేడయ్యాక దోసలు వేసుకోవాలి , నూనెతో దోరగా కాల్చుకోవాలి
 4. అంతే టేస్టీ దోసలు రెడీ

నా చిట్కా:

దోసలు సాఫ్ట్ గా టేస్టీ గా ఉండాలి అంటే పిండి రుబ్బేటప్పుడు అన్నం వేసి రుబ్బుకోవాలి

Reviews for Multi pulses dosa Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo