ఆలూ చాట్ | Aloo chat Recipe in Telugu

ద్వారా Gadige Maheswari  |  15th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Aloo chat by Gadige Maheswari at BetterButter
ఆలూ చాట్by Gadige Maheswari
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

18

0

ఆలూ చాట్ వంటకం

ఆలూ చాట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Aloo chat Recipe in Telugu )

 • ఆలు గడ్డలు పెద్ద సైజువి - 3
 • పల్లీలు - 1/2 కప్
 • ఉల్లిపాయ - 1
 • టమాట - 1
 • కరివేపాకు - కొద్దిగా
 • కొత్తిమీర - కొద్దిగా
 • సన్న సేగు / సేవ్ - 1/2 కప్
 • చాట్ మసాలా 1 స్పూన్
 • గరంమసాలా 1/2 స్పూన్
 • కారం 1 స్పూన్
 • ఉప్పు తగినంత
 • నూనె - 2 స్పూన్

ఆలూ చాట్ | How to make Aloo chat Recipe in Telugu

 1. ముందుగా ఆలుగడ్డ ను నీళ్లలో శుభ్రంగా కడిగి ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
 2. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 స్పూన్ నూనె వేసి వేడయ్యాక పల్లీలు వేసి వెయించుకోని పక్కన పెట్టుకోవాలి.
 3. అందులోనే ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ,పచ్చిమిర్చి ,టమాట ముక్కలు కరివేపాకు వేసి వేయించాలి.
 4. అన్ని వేగాక ఆలుగడ్డను మెదిపి వేయించాలి.
 5. అందులోనే కారం , ఉప్పు , గరం మసాలా , చాట్ మసాలా వేసి వేయించాలి.
 6. ఒక ప్లేట్ లో ఆలూ మిశ్రమాన్ని తీసుకొని పైన సేవ్ , పెరుగు , వేయించి న పల్లీలు , తరిగిన కొత్తిమీర తో డేకరేట్ చేసుకోవాలి. అంతేనండి ఆలూ చాట్ రెడీ !

Reviews for Aloo chat Recipe in Telugu (0)