వెజ్ పులావ్ | Veg pulav Recipe in Telugu

ద్వారా sravanthi komaravelli  |  17th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Veg pulav recipe in Telugu,వెజ్ పులావ్, sravanthi komaravelli
వెజ్ పులావ్by sravanthi komaravelli
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

వెజ్ పులావ్ వంటకం

వెజ్ పులావ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Veg pulav Recipe in Telugu )

  • బాస్మతి బియ్యం రెండు కప్పులు
  • లవంగాలు 4
  • యాలకులు 3
  • దాల్చిన చెక్క చిన్న ముక్క
  • బిరియాని ఆకులు 2
  • షాజీరా 1/2 స్పూన్
  • జీడిపప్పు ముక్కలు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  • బంగాళదుంప ముక్కలు 1/4 కప్పు
  • క్యారెట్ ముక్కలు 1/4 కప్పు
  • బీన్స్ ముక్కలు 1/4 కప్పు
  • బఠాణీ 1/4 కప్పు
  • ఉప్పు తగినంత
  • నూనె లేదా నెయ్యి 3 స్పూన్లు
  • పెరుగు 2 స్పూన్లు
  • కొత్తిమీర, పుదీనా తరుగు
  • గరం మసాలా పొడి 1 స్పూన్

వెజ్ పులావ్ | How to make Veg pulav Recipe in Telugu

  1. బియ్యం కడిగి 10 నిమిషాలు నానబెట్టాలి.
  2. కుక్కర్ లో నూనె లేదా నెయ్యి వేసి వేడయ్యాక అందులో మసాలా దినుసులు వేసి వేయించాలి.
  3. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
  4. తరువాత కట్ చేసి పెట్టుకొన్న కూరగాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి.
  5. ఇప్పుడు పెరుగు, ఉప్పు, గరం మసాలా పొడి వేయాలి. కొత్తిమీర, పుదీనా తరుగు వేసి బాగా కలపాలి.
  6. 1 :1 1/2 నీళ్ళు పోసి మూత పెట్టాలి. నీళ్ళు మరిగిన తరువాత కడిగిన బియ్యం వేసి బాగా కలపాలి.
  7. కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చాక స్టౌవ్ ఆపేయాలి.

నా చిట్కా:

పులావ్ లో నిమ్మరసం వేస్తే బాగుంటుంది.

Reviews for Veg pulav Recipe in Telugu (0)