రోటి విత్ బేబీ కార్న్ మసాలా | Roti with baby corn masala Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  17th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Roti with baby corn masala recipe in Telugu,రోటి విత్ బేబీ కార్న్ మసాలా, Sree Vaishnavi
రోటి విత్ బేబీ కార్న్ మసాలాby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

రోటి విత్ బేబీ కార్న్ మసాలా వంటకం

రోటి విత్ బేబీ కార్న్ మసాలా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Roti with baby corn masala Recipe in Telugu )

  • గోధుమపిండి 3 కప్పులు
  • ఉప్పు తగినంత
  • పంచదార 1/2 చెంచా
  • నీళ్లు తగినంత
  • తరిగిన బేబీ కార్న్ 1 కప్
  • తరిగిన క్యారెట్ 1 కప్
  • తరిగిన బంగాళదుంప 1 కప్
  • ఉల్లిపాయ 2
  • అల్లం వెల్లులి పేస్ట్ 1 చెంచా
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • గరం మసాలా 2 చెంచాలు
  • నూనె 2 చెంచాలు
  • నీళ్లు తగినంత

రోటి విత్ బేబీ కార్న్ మసాలా | How to make Roti with baby corn masala Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండి ఉప్పు పంచదార, నీళ్లు, పోసి చపాతి పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి
  2. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడిఅయ్యిన తరువాత ఉల్లిపాయ, టమాటో ,అల్లం వెల్లులి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి
  3. వేగిన తరువాత మిక్సీ జార్ లోకి తీసుకుని నీళ్లు పోసుకుని పేస్టచేయాలి
  4. ఇప్పుడు మళ్ళి బాండి పెట్టి అందులో నూనె వేసి ఈ పేస్ట్ వేసి మూకుడుకి అంటుకోకుండా ఉండే వరకు వేయించాలి
  5. అప్పుడు అందులో ఉప్పు, కారం, గరం మసాలా వేసి వేయించి నీళ్లు పోసుకుని తరిగిన కూరగాయ ముక్కలు వేసి బాగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి అంతే
  6. ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండి తీసుకుని బాల్స్ చేసుకోవాలి
  7. వాటిని వత్తి పెనం పై వేసి రెండు వైపులా కలిచుకుని సర్వ్ చేసుకోవడమే

Reviews for Roti with baby corn masala Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo