గోధుమ రవ్వ కట్టె పొంగలి | Weat ravva hot pongal Recipe in Telugu

ద్వారా Chandrika Marripudi  |  18th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Weat ravva hot pongal recipe in Telugu,గోధుమ రవ్వ కట్టె పొంగలి, Chandrika Marripudi
గోధుమ రవ్వ కట్టె పొంగలిby Chandrika Marripudi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

గోధుమ రవ్వ కట్టె పొంగలి వంటకం

గోధుమ రవ్వ కట్టె పొంగలి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Weat ravva hot pongal Recipe in Telugu )

 • గోధుమ రవ్వ : 2 కప్పులు
 • పెసరపప్పు : 1కప్పు
 • నూనె : 2 స్పూన్లు
 • ఉల్లిపాయ : 1
 • పచ్చిమిర్చి : 4
 • మిరియాలు : 2స్పూన్లు
 • జీలకర్ర : 2స్పూన్లు
 • అల్లం : చిన్న ముక్క
 • ఉప్పు : తగినంత
 • కరివేపాకు : 2 రెమ్మలు

గోధుమ రవ్వ కట్టె పొంగలి | How to make Weat ravva hot pongal Recipe in Telugu

 1. ముందుగా పెసరపప్పు కడిగి నానపెట్టుకోవాలి.
 2. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, మిరియాలు, కరివేపాకు అల్లం తురుము వేసి వేయించాలి.
 3. ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి వేసి వేయించాలి.
 4. తరువాత పెసరపప్పు నీళ్లు వార్చేసి వేసి వేయించాలి.
 5. ఇపుడు అందులో ఎసరు పోసి,తగినంత ఉప్పు వేసి మరిగించాలి.
 6. ఎసరు మరిగాక గోధుమరవ్వ వేసి కలుపుకుంటూ ఉడికించి దగ్గర పడ్డాక దించుకోవాలి.

Reviews for Weat ravva hot pongal Recipe in Telugu (0)