కొబ్బరి అన్నం | coconut rice Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  19th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • coconut  rice recipe in Telugu,కొబ్బరి అన్నం, Kavitha Perumareddy
కొబ్బరి అన్నంby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

కొబ్బరి అన్నం వంటకం

కొబ్బరి అన్నం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make coconut rice Recipe in Telugu )

  • పావుకేజీ బియ్యంతో చేసుకున్న అన్నం.పొడిగా ఉండాలి.
  • కొబ్బరి ఒక చిప్ప
  • పచ్చిమిర్చి 6
  • పోపుగింజెలు స్పున్
  • జీడిపప్పు 10 గ్రామ్స్
  • వేరుశనగ పప్పులు 2 స్పూన్స్
  • కొత్తిమీర గుప్పెడు
  • కరివేపాకు 2 రెమ్మలు
  • నూనె 2 స్పూన్స్
  • ఉప్పు తగినంత
  • నిమ్మకాయ 1

కొబ్బరి అన్నం | How to make coconut rice Recipe in Telugu

  1. ముందుగా కొబ్బరి ,3 పచ్చిమిర్చి మిక్షిలో వేసి కొబ్బరి పొడిలా చేసుకోవాలి.నీరు వేయకూడదు.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి నూనెవేసి వేడిచేసి పోపుగింజేలు,వేరుశెనగ గుళ్ళు,జీడిపప్పు, ఎండుమిర్చి వేసి వేగిన తరువాత 3 పచ్చిమిర్చి ముక్కలు,కరేపాకు వేసుకొని వేపుకోవాలి.కొత్తిమీర కూడా కొద్దిగా వేసి కలుపుకోవాలి.
  3. ఇప్పుడు వేగిన పోపులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమం వేసుకోవాలి.తగినంత ఉప్పు కూడా వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. 5 నిముసాలు కొబ్బరిని మగ్గించాలి.
  4. ఇప్పుడు మగ్గిన కొబ్బరి మిశ్రమంలో అన్నం వేసి అంతా కలిపి ఒక 5 నిముసాలు ఉంచాలి.ఇప్పుడు కొబ్బరి అన్నంలో నిమ్మకాయ రసం మిగిలిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి.
  5. ఇంకా వేడి వేడిగా కొబ్బరి అన్నం రెడీ ఐపోయింది.లంచ్ బాక్స్ లో సర్దుకోవడమే. దీనికి సైడ్ డిష్ ఏమి లేకపోయినా ఉట్టిగానే బాగుంటుంది.

నా చిట్కా:

కొబ్బరి అన్నంలో ఉప్పు మాములుగా కంటే కొద్దిగా తక్కువే వేసుకుంటే బాగుంటుంది. అప్పుడు కొబ్బరిరుచి బాగతెలుస్తుంది.

Reviews for coconut rice Recipe in Telugu (0)