తోఫు పరాఠా అవకాడో చట్నీ | Tofu paratha with avcado pickle Recipe in Telugu

ద్వారా Swapna Sashikanth Tirumamidi  |  19th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Tofu paratha with avcado pickle recipe in Telugu,తోఫు పరాఠా అవకాడో చట్నీ, Swapna Sashikanth Tirumamidi
తోఫు పరాఠా అవకాడో చట్నీby Swapna Sashikanth Tirumamidi
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

4

0

తోఫు పరాఠా అవకాడో చట్నీ వంటకం

తోఫు పరాఠా అవకాడో చట్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tofu paratha with avcado pickle Recipe in Telugu )

 • తోఫు 450 గ్రా..
 • కేరేట్ కోరు ఒక కప్
 • అల్లం ముక్క 1(పేస్ట్ ఐతే ఒక పెద్దస్పూన్)
 • పచ్చిమిర్చి 3
 • జీలకర్ర అరచెమ్చా
 • గరం మసాలపొడి ఒక చెంచా
 • ఉప్పు అర చెంచా
 • కొత్తిమీర సన్నగా తరిగినది 4 చెంచాలు.
 • చపాతీ కి....చపాతీ పిండి 2 కప్పులు
 • ఉప్పు సరిపడా
 • నూని ఒక కప్.
 • బటర్ ఒక కప్.
 • అవకాడో చట్నీ కి....అవకాడో 1
 • జీలకర్ర పావు చెంచా
 • ఆవాలు పావు చెంచా
 • మినపప్పు పావు చెంచా
 • ఉప్పు పావు చెంచా
 • ఎండు మిర్చి 2
 • కరివేపాకు ఒక రెమ్మ
 • నిమ్మకాయ ఒక చెక్క.
 • పసుపు చిటికెడు.
 • ఆలివ్ ఆయిల్ ఒక స్పూను.

తోఫు పరాఠా అవకాడో చట్నీ | How to make Tofu paratha with avcado pickle Recipe in Telugu

 1. ముందుగా చపాతీ పిండి,సాల్ట్,నీరు కొన్చమ్ నూని వేసి కలుపుకొని ముద్దచేసి పక్కనపెట్టుకోవాలి.
 2. మిక్సీ జార్లో జీలకర్ర,పచ్చిమిర్చి, అల్లం వేసి నీరు వెయ్యకుండా ఆడుకోవాలి.
 3. ఇప్పుడు తోఫు ని సన్నగా కోరి నీరు ఏమైనా ఉంటే రెండు చేతులమధ్య పెట్టి జాగ్రత్తగా వత్తి నీటిని తీసేసి ఒక బౌల్ లోకి తీసి పెట్టుకోవాలి.
 4. ఇప్పుడు అందులో కేరేట్ కోరు,కొత్తిమీర తరుగు,అల్లం మిర్చి జీలకర్ర మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి.
 5. ఇప్పుడు కొద్దిగా సాల్ట్,గరం మసాలపొడి కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
 6. ఇప్పుడు చపాతీ పిండిని ఉండలుగా చేసి పెట్టుకోవాలి
 7. ఒక చపాతీ ఉండ ఎంత ఉందో అంత పరిమాణం లో తోఫు మిశ్రమం ఉండేలా చూసుకొని ....ఒక్కొక్క చపాతీ వుండలోనూ స్టఫ్ చేసుకుని పెట్టుకోవాలి.
 8. ఇప్పుడు పొయ్యిమీద పెనం పెట్టుకుని వేడిచేసుకోవాలి.
 9. అది వేడయ్యేలోపు ఒక్కొక్క పరోటాని వత్తుకోవాలి.
 10. ఇప్పుడు పెనం మీద వేసుకుని నూనె గానీ ,బట్టర్ గానీ రాస్తూ సన్నసెగ మీద రెండువైపులా కాల్చుకోవాలి.
 11. ఇప్పుడు అవకాడో చట్నీ చూద్దాం....ముందుగా పోపు కి కొద్దిగా నూనె వేడిచేసుకోవాలి
 12. అందులో ఆవాలు..ఎండు మిర్చి, మినపప్పు..జీలకర్ర (ఇష్టం ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు)వేసుకుని వేయించి ,కరివేపాకు వేసి వేయించి దించి వేరే గిన్నీలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి..
 13. ఇప్పుడు అవకాడో ని తొక్క ఒలిచి,లోపలి గింజ తీసి పడేసి ముక్కలు చేసి మిక్సిజార్లో వేసుకోవాలి
 14. ఇప్పుడు ఉప్పు,పసుపు,పోపులో వేయించిన ఎండు మిర్చిని మాత్రమే చిదిపి వేసి...ఒక్కసారి మిక్సీని రన్ చేసి ఆపేయాలి.
 15. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని పోపుగిన్నిలోకి తీసుకుని వెంటనే నిమ్మరసం పిండి ఒక చెంచా ఆలివ్ ఆయిల్ వేసి అన్నీ కలిసేలా బాగా కలిపి పెట్టుకుంటే అవకాడో చట్నీ సిద్ధం అయినట్టే...
 16. ఇక వేడి వేడి పరాఠాలు సిల్వర్ ఫాయిల్ లో చుట్టి, అవకాడో చట్నీ తో ...కాస్త కమ్మని గడ్డ పెరుగుతో....ఏదో ఒక పండు ...ఒక సలాడ్ తో లంచ్ బాక్స్ ని సిద్ధం చేస్తే ఇక పరిపూర్ణమైయిన భోజనం మనం అందించినట్టే.

నా చిట్కా:

అవకాడో కి నల్లబడే స్వభావం కాబట్టి ...ముందుగా చేసి పెట్టుకోకూడదు.ఒకవేళ నల్లబడినా ఏమి పర్వాలేదు.

Reviews for Tofu paratha with avcado pickle Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo