టమాటా రోటీ పచ్చడి | Tomato chutney Recipe in Telugu

ద్వారా Sadhhna praveen  |  20th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tomato chutney recipe in Telugu,టమాటా రోటీ పచ్చడి, Sadhhna praveen
టమాటా రోటీ పచ్చడిby Sadhhna praveen
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

3

0

టమాటా రోటీ పచ్చడి వంటకం

టమాటా రోటీ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato chutney Recipe in Telugu )

  • టమాటాలు 6
  • పచ్చి మిరపకాయలు 8
  • వెల్లుల్లి రెబ్బలు 4
  • జీలకర్ర ఒక టీ స్పూన్
  • పల్లిలు ఒక టేబుల్లో స్పూన్
  • కరివేపాకు ఒక రెమ్మ
  • నూనె 2 టేబుల్ స్పూన్
  • పసుపు చిటికెడు
  • ఉప్పుడు ఒక టీ స్పూన్ లేదా మీ రుచికి సరిపడా

టమాటా రోటీ పచ్చడి | How to make Tomato chutney Recipe in Telugu

  1. ముందుగా పాన్ పెట్టుకుని 2 స్పూన్స్ నూనె వేసి వేడెక్కనివ్వాలి
  2. ఇప్పుడు జీలకర వేసుకివాలి
  3. జీలకర్ర వేగగానే పల్లిలు వేసుకోని ఫ్రై చేసుకోవాలి
  4. ఇప్పుడు పచ్చి మిరపకాయలు వేసి వేయించులోవాలి
  5. ఇప్పుడు తరిగిన టమాటా ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించాలి
  6. ఇప్పుడు కరివేపాకు రెమ్మలు మరియు వెల్లుల్లి రెబ్బలు వేసి కలిపుకివాలి
  7. ఇప్పుడు చిటికెడు పసుపు మరియు ఉప్పు వేసుకోవాలి... ఉప్పు వేయడం వల్ల టమాటాలు తొందరగా మగ్గుతాయి
  8. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి
  9. టమాట పూతిగా మగ్గిన తరవాత.. స్టవ్ ఆఫ్ చేసుకివాలి
  10. ఇది కాసేపు చల్లార బెట్టాలి
  11. ఇప్పుడు మిక్సీ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి
  12. ఇంకా ఉప్పు వేసుకోవాలి అనిపిస్తే కొద్దిగా వేసుకివచ్చు
  13. దీనికి తల్లింపు అవసరం లేదు... కానీ మీకు లుక్ కావాలి అనుకుంటే... కొద్దిగా నూనె, పోపు దినుసులు వేసి తాలింపు పెట్టి ధీనీలో కలుపుకివచ్చు..
  14. అంతే ఎంతో రుచికరమైన టమాటా రోటీ పచ్చడి రెడి

నా చిట్కా:

కూరగాయ ముక్కలు ఏవైనా ఫ్రై చేసేటప్పుడు కాస్త ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి..

Reviews for Tomato chutney Recipe in Telugu (0)