ఉసిరికాయ ఎండుమిర్చి పచ్చడి | Gooseberry red chilly pickle Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  20th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Gooseberry  red chilly pickle  recipe in Telugu,ఉసిరికాయ ఎండుమిర్చి పచ్చడి, Kavitha Perumareddy
ఉసిరికాయ ఎండుమిర్చి పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

0

0

ఉసిరికాయ ఎండుమిర్చి పచ్చడి వంటకం

ఉసిరికాయ ఎండుమిర్చి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gooseberry red chilly pickle Recipe in Telugu )

  • ఉసిరికాయ లు అరకిలో
  • ఎండుమిర్చి 20,కానీ 25 కానీ మీ ఇష్టం
  • ఉప్పు తగినంత
  • నూనె 4 స్పూన్స్
  • మినపప్పు 1 స్పున్
  • శనగపప్పు 1 స్పున్
  • జీలకర్ర 1 స్పున్
  • ధనియాలు 1 స్పున్
  • మెంతులు పావు స్పున్
  • ఆవాలు 1 స్పున్
  • వెల్లుల్లి రెబ్బలు 6
  • కరివేపాకు కొద్దిగా

ఉసిరికాయ ఎండుమిర్చి పచ్చడి | How to make Gooseberry red chilly pickle Recipe in Telugu

  1. ముందుగా ఉసిరికాయలు శుభ్రంగా కడిగి పొడి టవల్ తో తుడిచి పెట్టుకోవాలి. దెబ్బ తిన్న ఉసిరికాయలు తీసివేయాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి మినప్పప్పు, సెనగపప్పు, జీలకర్ర, మెంతులు,ధనియాలు, ఎండుమిర్చి వేసి చిన్న మంట మీద దోరగా వేయించుకుని పక్కకు తీసుకోవాలి. మరల అదే బాండీలో స్పున్ నూనె వేసి ఉసిరికాయలు వేసి మూత పెట్టి చిన్న మంట మీద మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. చేత్తో వత్తి చూస్తే గింజె విడిపోతే ఉసిరికాయలు మగ్గినట్లే .అన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి.
  3. ఉసిరికాయలు గింజేలు వేరు చేసి పెట్టుకోవాలి. తరువాత రోటిలో ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, పోపుగింజెలు,తగినంత ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత ఉసిరికాయలు ముక్కలు కూడా వేసి అంతా కలిపి బాగా దంచుకోవాలి.
  4. ఇప్పుడు దంచిన తరువాత పోయిమీద బాండీ పెట్టి నూనె వేసి ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లిని వేసి పోపు వేగిన తరువాత దంచిన పచ్చడిని వేసి అంతా పోపు లో కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి.
  5. చల్లారిన తరువాత వేరే గిన్నెలో తీసుపెట్టుకోవాలి. ఈ పచ్చడి నెలరోజులు ఐనా నిలువ ఉంటుంది. తడి తగలకుండా ఉండాలి.

నా చిట్కా:

ఎండుమిర్చి వేయించేటప్పుడు కొద్దిగా నూనెవేసి వేయించితే ఘాటురాదు . :blush:

Reviews for Gooseberry red chilly pickle Recipe in Telugu (0)