పల్లీ కొబ్బరి చెట్నీ | Peenut coconut chetny Recipe in Telugu

ద్వారా Chandrika Marripudi  |  21st Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Peenut coconut chetny recipe in Telugu,పల్లీ కొబ్బరి చెట్నీ, Chandrika Marripudi
పల్లీ కొబ్బరి చెట్నీby Chandrika Marripudi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

0

0

పల్లీ కొబ్బరి చెట్నీ వంటకం

పల్లీ కొబ్బరి చెట్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Peenut coconut chetny Recipe in Telugu )

  • పల్లీలు : 2 గుప్పెళ్ళు
  • పచ్చికొబ్బరి : 1 చిప్ప(చిన్న ముక్కలుగా తరగాలి.)
  • పచ్చిమిర్చి : 10
  • నూనె : 4 స్పూన్లు
  • చింతపండు : చిన్న రెబ్బ
  • వెల్లుల్లి : 4 రెబ్బలు
  • ఆవాలు : 1 స్పూన్
  • మినప్పప్పు : 1 స్పూన్
  • పచ్చిశనగపప్పు : 2 స్పూన్లు
  • జీలకర్ర : 1స్పూన్
  • ఎండుమిర్చి : 2
  • ఉప్పు : తగినంత
  • కరివేపాకు : 2రెమ్మలు

పల్లీ కొబ్బరి చెట్నీ | How to make Peenut coconut chetny Recipe in Telugu

  1. ముందుగా పల్లీలు, పచ్చిమిర్చి 1 స్పూను నూనె వేసి వేయించాలి.
  2. పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
  3. మిక్సి జార్లో వేయించిన పల్లీలు,,పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు వేయాలి.
  4. అందులోనే తగినంత ఉప్పు,వెల్లుల్లి, చింతపండు వేసి మిక్సి పట్టాలి
  5. కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టాలి
  6. తయారయిన చెట్నీని ఒక గిన్నెలో తీసుకోవాలి.
  7. బాండీలో 2 స్పూన్ల నూనె వేసి పోపుదినుసులు, కరివేపాకు వేసి పోపు పెట్టి చెట్నీలో వేసి కలుపుకోవాలి.

Reviews for Peenut coconut chetny Recipe in Telugu (0)