మామిడల్లం పచ్చడి | mangoginger chutney Recipe in Telugu

ద్వారా Sri Tallapragada Sri Devi  |  21st Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • mangoginger chutney recipe in Telugu,మామిడల్లం పచ్చడి, Sri Tallapragada Sri Devi
మామిడల్లం పచ్చడిby Sri Tallapragada Sri Devi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

About mangoginger chutney Recipe in Telugu

మామిడల్లం పచ్చడి వంటకం

మామిడల్లం పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make mangoginger chutney Recipe in Telugu )

  • మామిడి అల్లం 50 గ్రాములు
  • చిన్న నిమ్మకాయంత చింతపండు లేదా చింతకాయలు
  • ఎండుమిర్చి ఒక ఐదు
  • మినప్పప్పు రెండు స్పూన్లు
  • ఆవాలు ఒక స్పూను
  • మెంతులు అర స్పూన్
  • నూనె 2స్పూనులు
  • ఇంగువ చిటికెడు
  • కరివేపాకు రెండు రెబ్బలు
  • పసుపు చిటికెడు
  • ఉప్పు తగినంత

మామిడల్లం పచ్చడి | How to make mangoginger chutney Recipe in Telugu

  1. మామిడి అల్లం ని కడిగి చెక్కు తీసి చిన్న ముక్కలుగా తరుక్కోవాలి
  2. స్టౌ మీద మూకుడు పెట్టి నూనె వేసి మిరపకాయలు మెంతులు ఆవాలు మినపప్పు ఇంగువ కరివేపాకు వేయించుకోవాలి
  3. ఈపు పోపు తీసేసిన నూనెలోనే అల్లం ముక్కలు ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి
  4. వేయించుకున్న అల్లం ముక్కలు చింతపండు లేదా పచ్చి చింతకాయ లు ఉప్పు పసుపు ఎండుమిర్చి పోపు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి
  5. మెత్తగా నలిగిన పచ్చడిని వేరే తీసి కొద్ది నూనె తో ఎండుమిర్చి ముక్కలు మినప్పప్పు ఆవాలు కరివేపాకు పోపు పైన వేయాలి

నా చిట్కా:

పోపు తినేముందు కలుపుకుని నట్లయితే పంటికింద చిటపటలాడుతూ బాగుంటుంది

Reviews for mangoginger chutney Recipe in Telugu (0)