హోమ్ / వంటకాలు / దబ్బకాయ పచ్చడి

Photo of Citron Pickle by Pravallika Srinivas at BetterButter
107
2
0.0(0)
0

దబ్బకాయ పచ్చడి

Sep-21-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దబ్బకాయ పచ్చడి రెసిపీ గురించి

దబ్బకాయ పచ్చడి పెరుగు అన్నం లో నంచుకోవడానికి మరియు వేడి అన్నం లోకి చాల బాగుంటుంది. సి విటమిన్ వలన పుల్లగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 10

  1. దబ్బకాయ 1 పెద్దది
  2. నీరు 1 గ్లాసు
  3. ఉప్పు 100 గ్రా
  4. కారం. 100 గ్రా
  5. వెల్లులి రెబ్బలు 50 గ్రా
  6. వేయించిన మెంతులు 10 గ్రా
  7. నూనె 50 మిలి
  8. ఇంగువ 1/4 స్పూన్
  9. కర్వేపాకు 2 రెమ్మలు
  10. ఎండుమిరపకాయలు 4
  11. పోపు దినుసులు 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా దబ్బకాయ ని నీటితో కడిగి ఒక తాపాలలో వేసి నీరు పోసి మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు వెల్లుల్లికారం సిద్ధం చేసుకోవచ్చు. ఒక మిక్సర్ జార్ లో ఉప్పు కారం వెల్లులి రెబ్బలు వేయించిన మెంతులు అన్నీకలిపి మెత్తగా పొడి కొట్టుకోవాలి.
  3. చల్లారిన దబ్బకాయ లోని గుజ్జుని పిండి లోపల ఉన్న తొక్కుని తీసి వేయాలి. పైన దబ్బకాయ తొక్కు ని ముక్కలుగా తుంచుకోవాలి. తయారైన గుజ్జులో వెల్లులి కారం కలిపి దబ్బకాయ ముక్కలు అన్ని కలుపుకోవాలి.
  4. స్టవ్ మీద కడైయి పెట్టి నూనె వేసి పోపు దినుసులు యండుమిరపకాయలు ఇంగువ కర్వేపాకు వేసి చిటపటలాడాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన పోపు ని ముందుగా కలుపుకున్న దబ్బకాయ పచ్చడి లో కలుపుకోవాలి. అంతే దీనిని ఒక డబ్బాలో వేసి ఎప్పుడు కావాలన్నా తినవచ్చు. ఒక నెల రోజులు నిల్వ ఉంటుంది. ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఫ్రిడ్జ్ లో భద్రపరుచుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర