చికెన్ పచ్చడి | Chiken pachadi Recipe in Telugu

ద్వారా Veeru Katakam  |  21st Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Chiken pachadi recipe in Telugu,చికెన్ పచ్చడి, Veeru Katakam
చికెన్ పచ్చడిby Veeru Katakam
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    45

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

చికెన్ పచ్చడి వంటకం

చికెన్ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chiken pachadi Recipe in Telugu )

  • చికేన్ బోన్లెస్ 500 గ్రాములు
  • వెల్లుల్లి పాయలు 20
  • మెంతిపిండి 1/2 స్పూన్
  • కారం 2 స్పూన్స్
  • ఉప్పు తగినంత
  • పసుపు 1 స్పూన్
  • గరంమసాలా 1 స్పూన్
  • జీలకర్ర 1/2స్పూన్
  • ఆవాలు 1/2 స్పూన్
  • కరివేపాకు 1/2 స్పూన్
  • నూనె 1కప్

చికెన్ పచ్చడి | How to make Chiken pachadi Recipe in Telugu

  1. స్టవ్ పై గిన్నె పెట్టి చికెన్ వేసి కొన్ని నీళ్లు పోసి కొంచం పసుపు, ఉప్పు వేసి 10 నిముషాలు ఉడికించి పక్కనపెట్టుకోవాలి
  2. తరువాత మిక్సీ లో వెల్లులి,కారం,ఉప్పు వేసి పొడిచేసి పక్కన పెట్టుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేయించటానికి నూనె పోసుకొని వేడయ్యాక చికెన్ ను వేసి ఫ్రై చేసుకోవాలి
  4. ఈ చికెన్ ఎర్రగా అయ్యేంత వరకూ ఫ్రై చేసుకోవాలి
  5. దీనిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి
  6. ఇప్పడు బాండీలో నూనె కొద్దిగా తీసుకుని అందులో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి.
  7. తరువాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి
  8. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసుకోవాలి
  9. తరువాత ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసి కలుపుకోవాలి
  10. ఇప్పుడు మెంతిపిండి, గరంమసాలా వేసి చల్లార్చుకుని దాంట్లో నిమ్మరసం వేసి కలుపుకుంటే టేస్టీ చికెన్ పచ్చడి రెడీ.

నా చిట్కా:

ఈ చికెన్ పచ్చడి ఒక రోజు ఊరబెట్టిన తరువాత చాలా టేస్టీ గా ఉంటుంది. 10 రోజులు నిల్వ ఉంటుంది

Reviews for Chiken pachadi Recipe in Telugu (0)