బీర తొక్కు పచ్చడి | Ridge gourd peel chutny Recipe in Telugu

ద్వారా Anitha Rani  |  23rd Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ridge gourd peel chutny recipe in Telugu,బీర తొక్కు పచ్చడి, Anitha Rani
బీర తొక్కు పచ్చడిby Anitha Rani
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

2

0

బీర తొక్కు పచ్చడి వంటకం

బీర తొక్కు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ridge gourd peel chutny Recipe in Telugu )

  • బీరకాయ తొక్కు : 1పెద్ద బీరకాయ
  • మినపప్పు : 2 టేబుల్ స్పూన్
  • జీలకర్ర : 1 స్పూన్
  • చింతపండు : చిన్న నిమ్మకాయ
  • ఎండు మిరపకాయలు : 2
  • పచ్చి మిరపకాయలు : 6
  • ఉప్పు : తగినంత
  • నూనె : 4 స్పూన్లు
  • వెల్లుల్లిరెబ్బలు : 4
  • ఆవాలు : 1స్పూన్
  • కరివేపాకు : కొద్దిగా

బీర తొక్కు పచ్చడి | How to make Ridge gourd peel chutny Recipe in Telugu

  1. మొదట బీరకాయ ను బాగా కడిగి తొక్క తీసుకోవాలి
  2. స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేసి మినపప్పు,జీలకర్ర,వేగాక పచ్చి మిర్చి, తొక్కు,ఉప్పు,పసుపు చింతపండు వేసి చిన్న మంట మీద మూత పెట్టి ఉడికించాలి.
  3. చల్లారిన తరువాత రోటిలో కానీ మిక్సీ లో కానీ వేసుకొని రుబ్బుకోవాలి.
  4. ప్యాన్ వేడి అయ్యాక ఆవాలు,వెల్లుల్లిరెబ్బలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు,కరివేపాకు వేసి పోపు వేగాక పచ్చడి లో వేసుకొని కలుపుకోవాలి.
  5. ఎంతో రుచికరమైన బీరకాయ తొక్కు పచ్చడి రెడీ.

నా చిట్కా:

బీర తొక్కు ఉప్పు నీళ్ళల్లో కడగాలి. తొక్కు లో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

Reviews for Ridge gourd peel chutny Recipe in Telugu (0)