టమాటా పచ్చడి. | Tamata chutney. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  23rd Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tamata chutney. recipe in Telugu,టమాటా పచ్చడి., దూసి గీత
టమాటా పచ్చడి.by దూసి గీత
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    40

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

టమాటా పచ్చడి. వంటకం

టమాటా పచ్చడి. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tamata chutney. Recipe in Telugu )

  • టమాటాలు : 1 కిలో
  • నూనె : 1 కప్పు.
  • కారం : 1/4 కప్పు.
  • ఉప్పు : 2 చెంచాలు.
  • 1 చెంచాడు మెంతులు, 4 ఎండుమిర్చి డ్రై రోస్ట్ చేసి రెడీ చేసిన పౌడర్ .
  • శనగపప్పు 1 స్పూన్
  • ఎండు మిర్చి : 3.
  • కరివేపాకు. : రెండు రెమ్మలు.
  • ఆవాలు : 1/2 చెంచా.
  • ఇంగువ : 1/2 చెంచా.

టమాటా పచ్చడి. | How to make Tamata chutney. Recipe in Telugu

  1. టమాటాలు శుభ్రం చేసి, మిక్సీ లో గ్రైండ్ చెయ్యాలి.
  2. దళసరి మూకుడు పెట్టి వేడెక్కాక, అందులో ఈ టమాటా మిశ్రమం అంతా వేసి ఉడికించాలి.దీనికి దాదాపు అరగంట పైనే పడుతుంది.
  3. ఉడుకుతున్న మిశ్రమంలో ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా దగ్గర పడే వరకూ, మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి.
  4. వేరే మూకుడు లో నూనె వేసి కాగిన తర్వాత, పోపు వేయించుకొని స్టౌ కట్టేయాలి..
  5. నూనె కాస్త చల్లారిన తర్వాత రెడీగా ఉన్న మెంతి పొడీ, కారం , కరివేపాకూ, అన్నీ వేసి అందులోనే టమాటా మిశ్రమం కూడా వేసి బాగా కలపాలి.
  6. పచ్చడి మిశ్రమం ఉన్న మూకుడు తిరిగి స్టౌ మీద పెట్టి, 5 నిమిషాలు ఉంచి దించేయాలి.
  7. ఇడ్లీ,దోశ , ఉప్మా, అన్నం అన్నింట్లో కీ బావుండే ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి తయారు.

నా చిట్కా:

ఈ పచ్చడి ఫ్రిజ్ లో పెట్టుకుంటే 20 రోజులు పైగా ఫ్రెష్ గా ఉంటుంది. బయట నిలవ ఉండదు.

Reviews for Tamata chutney. Recipe in Telugu (0)