కంది పచ్చడి | Red Gram chutny Recipe in Telugu

ద్వారా Swapna Sashikanth Tirumamidi  |  23rd Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Red Gram chutny by Swapna Sashikanth Tirumamidi at BetterButter
కంది పచ్చడిby Swapna Sashikanth Tirumamidi
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

5

0

కంది పచ్చడి వంటకం

కంది పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Red Gram chutny Recipe in Telugu )

 • కంది పప్పు 1 కప్
 • ఎండు మిర్చి 6
 • చింతపండు గోళికాయ అంత
 • ఉప్పు రుచికి సరిపడా
 • ఆవాలు పావు టీ స్పూన్
 • మినపప్పు అర టీ స్పూన్
 • జీలకర్ర ఒక టీ స్పూన్
 • ఇంగువ(ఇష్టం ఉంటే) చిటికెడు
 • కరివేపాకు 3 రెబ్బలు
 • వెల్లుల్లి రెబ్బలు గుప్పెడు
 • నూనె 5 చెంచాలు.

కంది పచ్చడి | How to make Red Gram chutny Recipe in Telugu

 1. ముందుగా కంది పప్పుని శుభ్రం చేసికొని కమ్మటి సువాసన వచ్చేవరకు నూని వెయ్యకుండా ఎర్రగా వేయించి,చింతపండు వేసి గ్లాసుడు నీళ్లు పోసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.ఇలా వేడి పప్పులో నీళ్లు పోయడం వల్ల పచ్చడి రూబ్బేటపుడు త్వరగా నలుగుతుంది.
 2. 4 వెల్లుల్లి రెబ్బలు,అరచెంచా జీలకర్ర విడిగా పక్కకు తీసుకుని పెట్టుకోవాలి.
 3. ఇప్పుడు మూకుడు వేడి చేసి 5 చెంచాల నూనె వేసి వేడి చెయ్యాలి.
 4. ఇప్పుడు నూని కాగగానే చిన్న మంట పెట్టి ముందుగా వెల్లుల్లి రెబ్బలు వేయించి విడిగా తీసుకొని అదే మూకుడులో ఆవాలు ,మినప్పప్పు,అర చెంచా జీలకర్ర,ఎండు మిర్చి,కరివేపాకు, ఇంగువ, ఒక్కొక్కటిగా వేస్తూ పోపు మాడి పోకుండా వేయించాలి.
 5. సగం పోపు విడిగా ఉంచాలి(ఎండుమిర్చి మినహా)
 6. ఇప్పుడు మిక్సీ జార్ లో రెడీ చేసుకున్న కంది పప్పు మిశ్రమాన్ని ,విడిగా పెట్టిన పచ్చి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర లను పోపులో వేయించిన మొత్తం ఎండు మిర్చిని సగం పోపుని మాత్రమే వేసి అన్నిటిని కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
 7. గట్టిగా ఉంటే ఇంకొంచం నీరు పోసికుని రుబ్బుకోవచ్చు.
 8. ఇప్పుడు రుబ్బిన పచ్చడిని ఒక గిన్నీలోకి తీసుకొని వేయించి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు మిగిలిన పోపుని వేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలి.
 9. అంతేనండి ఘుమఘుమలాడే రుచికరమైన కందిపచ్చడి మీకోసం సిద్ధం .వేడివేడి అన్నంలో కమ్మటి నెయ్యితో కలుపుకుని తిని ఆ రుచిని ఆస్వాదించండి మరి ఆలస్యం ఎందుకు ?

నా చిట్కా:

కంది పచ్చడి లో చింతపండు వేసినా బావుంటుంది,,వెయ్యకపోయినా బావుంటుంది.ఈ పచ్చడి చేసిన రోజు చారు కూడా పెట్టుకోండం మరవద్దు.

Reviews for Red Gram chutny Recipe in Telugu (0)