దబ్బకాయ పొకింపు | Dabbakaya pokimpu Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  24th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Dabbakaya pokimpu recipe in Telugu,దబ్బకాయ పొకింపు, Sree Vaishnavi
దబ్బకాయ పొకింపుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

దబ్బకాయ పొకింపు వంటకం

దబ్బకాయ పొకింపు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dabbakaya pokimpu Recipe in Telugu )

  • దబ్బకాయలు 2
  • ఉప్పు తగినంత
  • దబ్బకాయ రసం 1/4 కప్
  • బెల్లం లేదా పంచదార 3 చెంచాలు
  • ఎండుమిరపకాయలు 5
  • మెంతులు 1 చెంచా
  • ఆవాలు 1 చెంచా
  • నూనె 3 చెంచాలు
  • పచ్చిమిరపకాయలు 3-4
  • పసుపు 1/2 చెంచా

దబ్బకాయ పొకింపు | How to make Dabbakaya pokimpu Recipe in Telugu

  1. ముందుగా దబ్బకాయలిని గింజలు తీసి ముక్కలుగా కోసుకోవాలి
  2. వాటిని ఒక గిన్నె లోకి తీసుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి వేడిఅయ్యిన తరువాత ఆవాలు ,మెంతులు ,ఎండుమిరపకాయలు వేసి వేయించాలి
  4. వేగిన తరువాత దానిని పొడి ల చేసుకోవాలి
  5. ఇప్పుడు ఆ దబ్బకాయ ముక్కలిని ఒక బాండి లో వేసుకోవాలి
  6. అందులో తగినంత కళ్లుప్పు వేసుకోవాలి
  7. అందులో ఇప్పుడు తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి
  8. ఇప్పుడు అందులో రసం కూడా వేసుకోవాలి
  9. ఇప్పుడు అందులో తగినంత బెల్లం లేదా పంచదార వేసుకోవాలి
  10. దాని స్టవ్ మీద పెట్టుకుని పసుపు కూడా వేసుకోవాలి
  11. ఇప్పుడు ఆ బెల్లం లేదా పంచదార వేసి కరిగే వరకు ఉంచుకోవాలి
  12. కరిగిన తరువాత అందులో తయారు చేసుకున్న పొడి వేసుకోవాలి
  13. దానిని బాగా కలిపి మూత పెట్టి అది దెగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే

Reviews for Dabbakaya pokimpu Recipe in Telugu (0)