హోమ్ / వంటకాలు / దబ్బకాయ పొకింపు

Photo of Dabbakaya pokimpu by Sree Sadhu at BetterButter
766
2
0.0(0)
0

దబ్బకాయ పొకింపు

Sep-24-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దబ్బకాయ పొకింపు రెసిపీ గురించి

ఇది చాల రుచిగా ఉంటుంది మరియు ఇది అన్నం లో నూనె వేసుకుని తింటే చాల బాగుంటుంది ఇది ఉట్టి పప్పు లో చాల రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 3

  1. దబ్బకాయలు 2
  2. ఉప్పు తగినంత
  3. దబ్బకాయ రసం 1/4 కప్
  4. బెల్లం లేదా పంచదార 3 చెంచాలు
  5. ఎండుమిరపకాయలు 5
  6. మెంతులు 1 చెంచా
  7. ఆవాలు 1 చెంచా
  8. నూనె 3 చెంచాలు
  9. పచ్చిమిరపకాయలు 3-4
  10. పసుపు 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా దబ్బకాయలిని గింజలు తీసి ముక్కలుగా కోసుకోవాలి
  2. వాటిని ఒక గిన్నె లోకి తీసుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి వేడిఅయ్యిన తరువాత ఆవాలు ,మెంతులు ,ఎండుమిరపకాయలు వేసి వేయించాలి
  4. వేగిన తరువాత దానిని పొడి ల చేసుకోవాలి
  5. ఇప్పుడు ఆ దబ్బకాయ ముక్కలిని ఒక బాండి లో వేసుకోవాలి
  6. అందులో తగినంత కళ్లుప్పు వేసుకోవాలి
  7. అందులో ఇప్పుడు తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి
  8. ఇప్పుడు అందులో రసం కూడా వేసుకోవాలి
  9. ఇప్పుడు అందులో తగినంత బెల్లం లేదా పంచదార వేసుకోవాలి
  10. దాని స్టవ్ మీద పెట్టుకుని పసుపు కూడా వేసుకోవాలి
  11. ఇప్పుడు ఆ బెల్లం లేదా పంచదార వేసి కరిగే వరకు ఉంచుకోవాలి
  12. కరిగిన తరువాత అందులో తయారు చేసుకున్న పొడి వేసుకోవాలి
  13. దానిని బాగా కలిపి మూత పెట్టి అది దెగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర