పచ్చి కొబ్బరి పండుమిరప పచ్చడి | Kobbari chutny Recipe in Telugu

ద్వారా Anitha Rani  |  24th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Kobbari chutny recipe in Telugu,పచ్చి కొబ్బరి పండుమిరప పచ్చడి, Anitha Rani
పచ్చి కొబ్బరి పండుమిరప పచ్చడిby Anitha Rani
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

1

0

పచ్చి కొబ్బరి పండుమిరప పచ్చడి వంటకం

పచ్చి కొబ్బరి పండుమిరప పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kobbari chutny Recipe in Telugu )

  • కొబ్బరి కాయ. : 1/2 చిప్ప
  • పండుమిరపకాయలు: 10
  • ఉల్లిపాయ : ఒకటి
  • వెల్లుల్లిరెబ్బలు : 6
  • చింతపండు : చిన్న నిమ్మకాయ లో సగము
  • ఎందుమిరపకాయలు : 2
  • ఉప్పు : తగినంత
  • ఆవాలు : 1 స్పూన్
  • జీలకర్ర : 1స్పూన్
  • కరివేపాకు : కొద్దిగా
  • మినపప్పు : అర స్పూన్
  • ఇంగువ : చిటికెడు

పచ్చి కొబ్బరి పండుమిరప పచ్చడి | How to make Kobbari chutny Recipe in Telugu

  1. పై సామాగ్రి ని సిద్ధము చేసుకొని,శుభ్రము చేసుకోవాలి.
  2. పచ్చి కొబ్బరి ని ముక్కలు చేసుకోవాలి.
  3. స్టవ్ పైన పాన్ పెట్టి వేడి అయ్యాక పండుమిరపకాయలు, జీలకర్ర,మినపప్పు,ఉల్లిపాయ ముక్కలు కలిపి దోరాగా వేయించుకోవాలి.
  4. చల్లారిన తరువాత కొబ్బరి ముక్కలు,అన్ని వేసి, ఉప్పు,చింతపండు వేసి రోటిలో కానీ మిక్సీ లో కానీ రుబ్బుకోవాలి.
  5. పోపుకోసము పాన్ లో 2స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర,ఎందుమిరపకాయలు,కరివేపాకు, వెల్లుల్లిరెబ్బలు, వేసి వేగాక రుబ్బుకున్న పచ్చడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి. రుచి కరమైన పచ్చడి తయారవుతుంది.

నా చిట్కా:

ఉల్లిపాయలు తరిగిన కత్తి కి నిమ్మరసము పూస్తే ఉల్లి వాసన రాదు.

Reviews for Kobbari chutny Recipe in Telugu (0)