పచ్చిమిర్చి పచ్చడి. | Green chilly chutney. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  24th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Green chilly chutney. recipe in Telugu,పచ్చిమిర్చి పచ్చడి., దూసి గీత
పచ్చిమిర్చి పచ్చడి.by దూసి గీత
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

పచ్చిమిర్చి పచ్చడి. వంటకం

పచ్చిమిర్చి పచ్చడి. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Green chilly chutney. Recipe in Telugu )

  • కాలిసిన పదార్థాలు :
  • 1 పచ్చిమిర్చి : 110 గ్రాములు.
  • 2 చింతపండు : నిమ్మకాయంత.
  • ‌3 కరివేపాకు : 1 రెమ్మ.
  • 4 కొత్తిమీర : ,చిన్న కట్ట 1
  • 5 మినప్పప్పు,ఆవాలు, జీలకర్ర,మెంతులు, ఇంగువ కలిపి 1/2 చెంచా.
  • 6 ఉప్పు : 1 చెంచా.
  • 7 నూనె : 2 చెంచాలు.

పచ్చిమిర్చి పచ్చడి. | How to make Green chilly chutney. Recipe in Telugu

  1. ముందుగా మినప్పప్పు,ఆవాలు, జీరా, మెంతులు, ఇంగువ పోపు వేయించి పక్కన పెట్టాలి.
  2. ఇప్పుడు మిగిలిన నూనె వేసి, పచ్చిమిర్చి కట్ చెసుకుని వేయించాలి. అందులోనే కరివేపాకు ,కొత్తిమీర, చింతపండు కూడా వేసి వేయించాలి.
  3. పచ్చిమిర్చి కాస్త రంగు మారే వరకూ అంటే ఓ 5 నిమిషాలు వేయించాలి. ‌
  4. ఇప్పుడు రోట్లో/ మిక్సీ లో ముందుగా సగం పోపు దినుసులు వేసి మెత్తగా అయ్యాక పచ్చిమిర్చి మిశ్రమం,ఉప్పు వేసి రుబ్బుకోవాలి.
  5. రుబ్బిన పచ్చడిలో మిగిలిన పోపు వేసి కలుపుకుని సర్వ్ చెయ్యాలి. నెయ్యి వేసుకుని తింటే చాలా బావుంటుంది.

నా చిట్కా:

ఖారం తినలేని వారు ఇందులో పల్లీలు కానీ, నువ్వులు కానీ కలిపి చేస్కోవచ్చు

Reviews for Green chilly chutney. Recipe in Telugu (0)