పెసరపప్పు పచ్చడి.....(moongdaal chutny) | Moongdaal chutny Recipe in Telugu

ద్వారా Shobha.. Vrudhulla  |  24th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Moongdaal chutny recipe in Telugu,పెసరపప్పు పచ్చడి.....(moongdaal chutny), Shobha.. Vrudhulla
పెసరపప్పు పచ్చడి.....(moongdaal chutny)by Shobha.. Vrudhulla
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

పెసరపప్పు పచ్చడి.....(moongdaal chutny) వంటకం

పెసరపప్పు పచ్చడి.....(moongdaal chutny) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Moongdaal chutny Recipe in Telugu )

  • పెసరపప్పు ఒక కప్పు
  • చింతపండు ఒక పిడికేడు
  • ఉప్పు తగినంత
  • ఎండు మిరపకాయలు ఐదు
  • ఆవాలు ఒక చెంచా
  • ఇంగువ మూడు చిటికెలు
  • కరివేపాకు ఒకరెబ్బ
  • నిమ్మకాయ ఒకటి
  • నూనె మూడు చంచాలు

పెసరపప్పు పచ్చడి.....(moongdaal chutny) | How to make Moongdaal chutny Recipe in Telugu

  1. ముందుగా చింతపండు కడిగి పావుగంట పాటు నానపెట్టుకోవలెను
  2. పెసర పప్పు కూడా కడిగి రెండు నిమిషాలు ఉంచాలి
  3. ఇప్పుడు పప్పులో ఉప్పు, మిరపకాయలు వేసి నానపెట్టి ఉంచిన చింతపండు నుండి తీసుకున రసం ఈ పప్పులో వేసుకొని మెత్తగా మిక్సీ లో రుబ్బుకోవలెను.
  4. రుబ్బినప్పుడు పులుపు సరిపోయిందా లేదా అని చూసుకొని కావాలంటే మరింత రసం పోసుకొని రుబ్బుకోవాలి .
  5. రుబ్బిన పచ్చడి ఒక గిన్నెలో వేసుకోండి
  6. ఇప్పుడు ఒక చిన్న ముకుడు స్టవ్ మీద పెట్టి వేడి అయ్యాక అందులో నూనె వేసుకోండి
  7. నూనె కాగిన తరువాత అందులో ఆవాలు , ఇంగువ , కరివేపాకు వేసి వేగనివ్వాలి.
  8. వేగిన తరువాత యి పోపుని రుబ్బిన పచ్చడిలోవేసి అందులో ఒక నిమ్మకాయని పిండుకోవాలి .
  9. పుల్ల పుల్లగా ఖారంగా ఎంతో రుచికరమయిన పెసరపప్పు పచ్చడి తయారు.
  10. అన్నాముతో తింటే చాలా రుచిగా ఉంటుంది

నా చిట్కా:

నిమ్మకాయ కావాలంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు

Reviews for Moongdaal chutny Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo