BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / రేగిపండు పండుమిర్చి తొక్కు పచ్చడి

Photo of Jujube Redchilli Pickle by Pravallika Srinivas at BetterButter
0
3
0(0)
0

రేగిపండు పండుమిర్చి తొక్కు పచ్చడి

Sep-24-2018
Pravallika Srinivas
60 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రేగిపండు పండుమిర్చి తొక్కు పచ్చడి రెసిపీ గురించి

రేగిపండ్లలోని ఐరన్ & ఫాస్ఫరస్ వలన ఎర్రరక్తకణాలు వృద్ధి చెందుతాయి. అందువలన ఐరన్ రక్తహీనత అజీర్తి & కండరాల సమస్య ఉన్నవారు ఈ రేగిపండు తీసుకోవడం వలన వాటిని అరికట్టవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 10

  1. రేగిపండ్లు 1 kg
  2. ఉప్పు 1 t glass
  3. పండుమిరపకాయలు 1/4 kg
  4. నూనె 2 tbsp
  5. పోపు దినుసులు 1 tbsp
  6. కర్వేపాకు 1 రెబ్బలు
  7. ఇంగువ 1 pinch
  8. పసుపు 1 pinch
  9. వెల్లుల్లిరెబ్బలు 4

సూచనలు

  1. ముందుగా పుల్లని నాటు రేగిపండ్లని కడిగి పుచ్చులు, పుల్లలు ఏరివేయాలి. యండలో ఆరనివ్వాలి. పండుమిరపకాయలను తొడిమలు వలిచి కడిగి ఆరనివ్వాలి .
  2. ఇప్పుడు పొడి రోట్లో రేగిపండు ఉప్పు వేసి బాగా దంచుకోవాలి. దీనిని దంచేటప్పుడు మెత్తగా కాకుండా కచ్చాపచ్చా గా దంచుకోవాలి. అన్ని రేగిపండ్లను దంచుకొని ఒక సీసాలో కానీ జాడి లో భద్రపరుచుకోవాలి.
  3. ఇప్పుడు పచ్చడి కోసం తగినంత రేగి తొక్కు తీసుకొని రేగిగింజలు ఏరివేయాలి. రోట్లో పండుమిర్చి ఉప్పు వేసి కచ్చాపచ్చాగా నూరి ముందుగా సిద్ధం చేసిన రేగిగుజ్జును కూడా రోట్లో వేసి పండుమిర్చి కారంలో కలిసేవిధంగా దంచుకోవాలి. తయారైన మిశ్రమాన్ని ఒక గిన్నిలో తోడుకోవాలి.
  4. ఒక కాలాయి పెట్టి నూనె వేసి కాగాక పోపుదినుసులు,కర్వేపాకు ,ఇంగువ, వెల్లుల్లిరెబ్బలు పసుపు వేసి చిటపటలాడాక పచ్చడి తో కలుపుకోవాలి. అంతే పిల్లలకు పెద్దలకు ఇష్టమైన రేగిపండు పండుమిర్చి తొక్కు పచ్చడి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర