కాలీఫ్లవర్ ఆవకాయ | CAULIFLOWER pickle Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  24th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • CAULIFLOWER pickle recipe in Telugu,కాలీఫ్లవర్ ఆవకాయ, Lalitha Kandala
కాలీఫ్లవర్ ఆవకాయby Lalitha Kandala
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

కాలీఫ్లవర్ ఆవకాయ వంటకం

కాలీఫ్లవర్ ఆవకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make CAULIFLOWER pickle Recipe in Telugu )

  • ఒక పెద్ద కాలీఫ్లవర్ లేదా 3 కప్స్ కాలీఫ్లవర్ ముక్కలు
  • నూనె ఒక కప్
  • 2 చెంచాలు మెంతులు
  • 2 చెంచాలు ఆవాలు
  • కారం రుచికి సరిపడా
  • ఉప్పు రుచికి సరిపడా
  • నిమ్మకాయలు 4
  • వెల్లుల్లి రెబ్బలు 15
  • పసుపు చిటికెడు

కాలీఫ్లవర్ ఆవకాయ | How to make CAULIFLOWER pickle Recipe in Telugu

  1. కాలీఫ్లవర్ ను ముందుగా బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి తుడిచి ఒక గుడ్డ మీద వేసి బాగా ఆరబెట్టాలి.
  2. తడిలేకుండా బాగా ఆరిన తరువాత పాన్ లో నూనె వేసి ముక్కలను 2 లేదా 3 నిమిషాలు వేయించి తీసి పక్కన పెట్టాలి.
  3. ఒక పాన్ లో మెంతులు వేసి వేయించి చల్లారాక పౌడర్ చేయాలి
  4. అలాగే ఆవాలు కూడా వేయించి పౌడర్ చెయ్యాలి.
  5. ఒక పెద్ద గిన్నెలో ఆవపిండి, మెంతిపిండి, కారం, ఉప్పు, కొద్దిగా పసుపు, కాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా కలిపి, నూనె కూడా పోసి, నిమ్మరసము వేసి బాగా కలిపి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి.
  6. కలిపిన ఆవకాయను మూత పెట్టి 24 గంటలు పక్కన పెట్టి మరునాడు బాగా కలిపి రుచి చూసి ఏమైనా తక్కువ ఉంటే కలిపి వేడి అన్నం లోకి గాని టిఫిన్ లోకి గాని తింటే బాగుంటుంది

Reviews for CAULIFLOWER pickle Recipe in Telugu (0)