మాగాయి | Maagayi Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  25th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Maagayi recipe in Telugu,మాగాయి, రమ్య వూటుకూరి
 • తయారీకి సమయం

  52

  గంటలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

0

0

మాగాయి వంటకం

మాగాయి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Maagayi Recipe in Telugu )

 • పుల్లని రసం వచ్చే మామిడి కాయలు 10
 • పసుపు
 • సాల్ట్ తగినంత
 • కారం 1 కప్
 • ఆవాలు 1 స్పూన్
 • మెంతులు 1 స్పూన్
 • పల్లి ఆయిల్ 1/4 కెజి
 • కరివేపాకు 2 రెమ్మలు
 • ఇంగువ 1/2 స్పూన్

మాగాయి | How to make Maagayi Recipe in Telugu

 1. మామిడి కాయలు కడిగి ఆరబెట్టి తొక్కు తీసుకొని పొడవుగా ముక్కలు కోసుకోవాలి
 2. తగినంత కల్లుఉప్పు పసుపు వేసుకొని బాగాకలిపి జాడీ లో ఉంచాలి
 3. 3 వ రోజు ముక్కలు ఊట వేరుచేసి ఎండ లో బాగా ఎండబెట్టాలి
 4. 2 రోజులు ఎండబెట్టిన తర్వాత ముక్కలు గట్టిగా, ఊట సగం అవుతాయి
 5. ఇప్పుడు ఊట లో ముక్కలు వేసి 2 రోజులు ఉంచితే ముక్క మెత్తబడుతుంది
 6. ఈ మిశ్రమంలో కారం వేసి బాగా కలుపుకోవాలి
 7. ఆయిల్ వేడి చేసి ఆవాలు మెంతులు ఇంగువ కరివేపాకుతో పోపు వేసుకొని కలుపుకోవాలి
 8. దీన్ని జాడీలో తడి తగలకుండా ఉంచితే ఇయర్ మొత్తం బాగుంటుంది

నా చిట్కా:

నిల్వ పచ్చడి పాడవకుండా ఉండాలంటే ఉప్పు సరిగా వేసుకోవాలి. గాలి,తడి తగలకుండా భద్రపరచుకోవాలి

Reviews for Maagayi Recipe in Telugu (0)