పాలకూర పచ్చడి | Spinach Chutney/Palak Chutney Recipe in Telugu

ద్వారా Swetha Ram  |  25th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Spinach Chutney/Palak Chutney recipe in Telugu,పాలకూర పచ్చడి, Swetha Ram
పాలకూర పచ్చడిby Swetha Ram
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

పాలకూర పచ్చడి వంటకం

పాలకూర పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spinach Chutney/Palak Chutney Recipe in Telugu )

  • పాలకూర 200 గ్రా
  • కొబ్బరి 1/4 కప్పు
  • మినప్పపు 2 టీస్పూన్లు
  • చెనగపప్పు 1 టీస్పూను
  • జీలకర్ర 1 టీస్పూన్
  • పసుపు 1/8 స్పూన్
  • ఇంగువ 1/8 స్పూన్
  • చింతపండు నిమ్మకాయంత
  • బెల్లం చిన్న ముక్క
  • ఉప్పు తగినంత
  • పోపు కి కావాల్సిన పదార్థాలు:
  • ఆవాలు 1టీస్పూన్
  • కరివేపాకు 1 రెమ్మ
  • ఎండుమిర్చి 2
  • నూనె 2 టీస్పూన్లు
  • వెల్లుల్లి 2

పాలకూర పచ్చడి | How to make Spinach Chutney/Palak Chutney Recipe in Telugu

  1. పాలకూర కడిగి వేడి నీళ్లలో వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి .
  2. ఉడికించిన పాలకురని వార్చుకొని మరొక గిన్నెలోకి తీసుకోవాలి
  3. స్టవ్ పైన చిన్న కడాయ్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత జీలకర్ర,పసుపు,మినప్పప్పు, చెనెగపప్పు ,ఎండు మిరపకాయలు,చింతపండు, ఇంగువ వేసుకొని బాగా వేయించాలి, తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొబ్బరి ముక్కలు వేయాలి.
  4. ఉడికించిన పాలకూర,మరియు వేయించిన మసాలా,బెల్లం మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి.
  5. తాలింపు కోసం ఒక కడాయ్ తీసుకొని నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు,వెల్లులి,ఎండుమిర్చి ,కరివేపాకు వేసి వెల్లులి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి, తర్వాత గ్రైండ్ చేసుకున్న పాలకూర పచ్చడి ని కూడా వేసి బాగా కలుపుకోవాలి.
  6. స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నె లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే పాలకూర పచ్చడి రెడి.

నా చిట్కా:

వెల్లులి ఇష్టపడని వారు ఇంగువ కూడా వేసుకోవచ్చును .

Reviews for Spinach Chutney/Palak Chutney Recipe in Telugu (0)