హోమ్ / వంటకాలు / పాలకూర పచ్చడి

Photo of Spinach Chutney/Palak Chutney by Swetha Ram at BetterButter
395
1
0.0(0)
0

పాలకూర పచ్చడి

Sep-25-2018
Swetha Ram
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర పచ్చడి రెసిపీ గురించి

పాలకూర పచ్చడి వేడి అన్నము లోకి ,ఇడ్లి,దోస,చపాతీ లోకి చాలా బాగుంటుంది. పిల్లలు పాలకూర ఇష్టపడక పోతే ఇలా పచ్చడి చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇది తయారు చేసుకోవటం చాలా సులభం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పాలకూర 200 గ్రా
  2. కొబ్బరి 1/4 కప్పు
  3. మినప్పపు 2 టీస్పూన్లు
  4. చెనగపప్పు 1 టీస్పూను
  5. జీలకర్ర 1 టీస్పూన్
  6. పసుపు 1/8 స్పూన్
  7. ఇంగువ 1/8 స్పూన్
  8. చింతపండు నిమ్మకాయంత
  9. బెల్లం చిన్న ముక్క
  10. ఉప్పు తగినంత
  11. పోపు కి కావాల్సిన పదార్థాలు:
  12. ఆవాలు 1టీస్పూన్
  13. కరివేపాకు 1 రెమ్మ
  14. ఎండుమిర్చి 2
  15. నూనె 2 టీస్పూన్లు
  16. వెల్లుల్లి 2

సూచనలు

  1. పాలకూర కడిగి వేడి నీళ్లలో వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి .
  2. ఉడికించిన పాలకురని వార్చుకొని మరొక గిన్నెలోకి తీసుకోవాలి
  3. స్టవ్ పైన చిన్న కడాయ్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత జీలకర్ర,పసుపు,మినప్పప్పు, చెనెగపప్పు ,ఎండు మిరపకాయలు,చింతపండు, ఇంగువ వేసుకొని బాగా వేయించాలి, తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొబ్బరి ముక్కలు వేయాలి.
  4. ఉడికించిన పాలకూర,మరియు వేయించిన మసాలా,బెల్లం మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి.
  5. తాలింపు కోసం ఒక కడాయ్ తీసుకొని నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు,వెల్లులి,ఎండుమిర్చి ,కరివేపాకు వేసి వెల్లులి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి, తర్వాత గ్రైండ్ చేసుకున్న పాలకూర పచ్చడి ని కూడా వేసి బాగా కలుపుకోవాలి.
  6. స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నె లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే పాలకూర పచ్చడి రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర