బీట్రూట్ పచ్చడి | BEETROOT pickle Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  25th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • BEETROOT pickle  recipe in Telugu,బీట్రూట్ పచ్చడి, Kavitha Perumareddy
బీట్రూట్ పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

బీట్రూట్ పచ్చడి వంటకం

బీట్రూట్ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make BEETROOT pickle Recipe in Telugu )

  • బీట్రూట్ ఒక గడ్డ పెద్దది
  • పచ్చిమిర్చి 15
  • జీలకర్ర స్పున్
  • ధనియాలు స్పున్
  • నూనె 3 స్పూన్స్
  • ఉప్పు తగినంత
  • పోపుగింజలు స్పున్
  • కరివేపాకు కొద్దిగా
  • వెల్లుల్లి 6 రెబ్బలు
  • ఎండుమిర్చి 2
  • చింతపండు కొద్దిగా ఉసిరికాయ అంత

బీట్రూట్ పచ్చడి | How to make BEETROOT pickle Recipe in Telugu

  1. ముందుగా బీట్రూట్, పచ్చిమిర్చి, తరిగి పెట్టుకోవాలి .చింతపండు కొద్దిగా నీరు పోసి నానబెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి జీలకర్ర, ధనియాలు వేసి వేగిన తరువాత బీట్రూట్, పచ్చిమిర్చి ముక్కలు వేసి 10 నిముసాలు మగ్గించుకోవాలి.
  3. తరువాత రోటిలో బీట్రూట్ మిశ్రమాన్ని, తగినంత ఉప్పు వేసి దంచుకోవాలి. తరువాత నానబెట్టిన చింతపండు వేసి అంతా కలిసేలా బాగా దంచుకోవాలి. నీళ్లు వేసుకోకూడదు. మిక్షిలో ఐనా రుబ్బుకోవచ్చు.
  4. తరువాత పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి పోపుగింజెలు,వెల్లుల్లి, కరివేపాకు ,ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకోని పచ్చడికి కలపాలి అంతే బీట్రూట్ పచ్చడి రెడీ ...

నా చిట్కా:

బీట్రూట్ తియ్యగా ఉంటుంది. అందుకని పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. కారం ఇష్టంలేకుంటే పచ్చిమిర్చి తగ్గించుకోవచు

Reviews for BEETROOT pickle Recipe in Telugu (0)