పెసరావకాయ | Pesaravakaya Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  26th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Pesaravakaya recipe in Telugu,పెసరావకాయ, Harini Balakishan
పెసరావకాయby Harini Balakishan
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  8

  జనం

1

0

పెసరావకాయ వంటకం

పెసరావకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pesaravakaya Recipe in Telugu )

 • రెండు గ్లాసుల పచ్చి మామిడి కోరు (పొట్టు తీయకుండ)
 • గరిటెడు కారంపుడి
 • ముప్పావు కప్పు వేయించి పొడి కొట్టిన పెసరపిండి
 • సగం గరిటెడు ఉప్పు
 • పావు గరిటెడు ఆవపిండి
 • అరచంచా వేయించి పొడి కొట్టిన మెంతులు
 • ముప్పావు గ్లాసు నువ్వుల సనూనె

పెసరావకాయ | How to make Pesaravakaya Recipe in Telugu

 1. మామిడి కాయలు తొక్క తీయకుండా తురుము కొని పెట్టుకోవాలి .
 2. ఆవాలు పొడి చేసి పెట్టుకోవాలి .
 3. పెసరపప్పు మరియు మెంతులు విడివిడిగా వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి .
 4. మామిడికోరు , కారం, ఉప్పు, పెసర పిండి , ఆవ పిండి , మెంతి పిండి , నూనె అన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి .
 5. అన్నిటినీ పూర్తిగా కలిసే వరకు కలుపుకుంటే పెసరావకాయ రెడీ.

నా చిట్కా:

మామిడి కాయలు ముక్కలు కొట్టి వేస్తే పచ్చడి నిలువ ఉంటుంది. తురిమిన పచ్చడి పది రోజులు ఉంటుంది

Reviews for Pesaravakaya Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo