మామిడికాయ మెంతి ముక్కలు | Instant mango pickle Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  26th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Instant mango pickle recipe in Telugu,మామిడికాయ మెంతి ముక్కలు, Sree Vaishnavi
మామిడికాయ మెంతి ముక్కలుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

1

0

మామిడికాయ మెంతి ముక్కలు వంటకం

మామిడికాయ మెంతి ముక్కలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Instant mango pickle Recipe in Telugu )

  • మామిడికాయ ముక్కలు 2 కప్పులు
  • కారం 2 చెంచాలు
  • మెంతి పొడి 1 1/2 చెంచా
  • ఆవ పిండి 1 చెంచా
  • ఉప్పు 1 1/4 చెంచా
  • పంచదార లేదా బెల్లం 3 చెంచాలు (మీ రుచికి సరిపడా వేసుకోవచ్చు )
  • నూనె 1/4 కప్
  • ఇంగువ చిటికెడు
  • ఆవాలు 1 చెంచా

మామిడికాయ మెంతి ముక్కలు | How to make Instant mango pickle Recipe in Telugu

  1. ముందుగా ఆవాలు , మెంతులు వేయించి మంచి వాసన వచ్చాక పొడి చేసుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో తరిగిన మామిడికాయ ముక్కలు ఉప్పు, కారం, మెంతి ఆవ పొడి, బెల్లం ,వేసి బాగా కలుపుకోవాలి
  3. బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి అప్పుడు అందులో ఊట ఊరుతుంది
  4. ఈలోపు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, ఇంగువ వేసి చిటపటలాడిన తరువాత మామిడికాయ ముక్కలలో వేసి బాగా కలిపి సర్వ్ చేయడమే

Reviews for Instant mango pickle Recipe in Telugu (0)