కాకరకాయ పచ్చడి | Bitter gourd chutney Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  27th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bitter gourd chutney recipe in Telugu,కాకరకాయ పచ్చడి, Kavitha Perumareddy
కాకరకాయ పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

0

0

కాకరకాయ పచ్చడి వంటకం

కాకరకాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bitter gourd chutney Recipe in Telugu )

  • కాకరకాయ లు పావుకేజీ
  • పచ్చిమిర్చి 15
  • ఉల్లిగడ్డ లు 2
  • నూనె టీ కప్
  • ఉప్పు తగినంత
  • బెల్లము 50 గ్రాములు
  • చింతపండు 50 గ్రాములు
  • పసుపు చిన్న స్పున్

కాకరకాయ పచ్చడి | How to make Bitter gourd chutney Recipe in Telugu

  1. ముందుగా కాకరకాయ లు శుభ్రం చేసి చిన్నగా కట్ చేసుకొని ఉప్పునీటిలో కడిగి పెట్టుకోవాలి.మిగతా వస్తువులు రెడీగా పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు రోటిలో ముందుగా పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసి దంచుకోవాలి. తరువాత కాకరకాయలు దంచుకోవాలి. తరువాత ఉల్లిపాయలు, నానబెట్టిన చింతపండు వేసి అంతా కలిసేలా దంచుకోవాలి.అన్ని పచ్చివే దంచుకోవాలి.
  3. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి నూనె వేసి దంచుకున్న కాకరకాయ పచ్చడి , పసుపు వేసి కాసేపు మగ్గిన తరువాత బెల్లము తురుము కూడా వేసి కలిపి 10 నిముసాలు బాగా మగ్గించాలి. పచ్చివాసన ఉండకుండా మగ్గించాలి.పచ్చడి బాగా దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలో తీసుకోవాలి.ఈ పచ్చడి 2 వారాలు ఐనా నిలువ ఉంటుంది.

నా చిట్కా:

కాకరకాయ పచ్చడిని రొటిలోనే దంచుకోవాలి. మిక్షిలో వేస్తే పనికి రాదు.

Reviews for Bitter gourd chutney Recipe in Telugu (0)