హోమ్ / వంటకాలు / తెల్ల గోంగూర లేదా మంచి గోంగూర పచ్చడి

Photo of Gongura Pachadi by Sri Tallapragada Sri Devi at BetterButter
476
0
0.0(0)
0

తెల్ల గోంగూర లేదా మంచి గోంగూర పచ్చడి

Sep-28-2018
Sri Tallapragada Sri Devi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తెల్ల గోంగూర లేదా మంచి గోంగూర పచ్చడి రెసిపీ గురించి

ఆంధ్ర శాకము అనబడే ఈ గోంగూర పచ్చడి తెలియని ఆంధ్రుడు ఉండదు కానీ ఎర్రగా ఉండే పుల్ల గోంగూర కన్నా తెల్లగా ఉండే గోంగూర పచ్చడి కి ప్రశస్తము. పుల్ల గోంగూర వాతమని ఈ తెల్ల గోంగూర వంటి వేడి చేస్తుందని అంటారు. ఇది రుచికి చాలాకొద్దిగా వగరుచేదుగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 4

  1. ఒక గోంగూర కట్ట పెద్దది ఒకటి
  2. పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు 2 లేదా అర స్పూన్ ఇంగువ
  3. మిరపకాయలు 15
  4. గింజలు లేని చింతపండు చిన్న నిమ్మకాయంత
  5. మినప్పప్పు రెండు స్పూన్లు
  6. మెంతులు ఒక స్పూన్
  7. ఆవాలు ఒక స్పూను
  8. నూనె ఒక చిన్న కప్పుడు
  9. ఉప్పు తగినంత

సూచనలు

  1. గోంగూర ఆకులు తెరిచి మట్టి లేకుండా బాగా కడుక్కోవాలి
  2. కడిగిన గోంగూరను నీడను బాగా ఆరనివ్వాలి
  3. మూకుడు లో నూనె వేసి ఎండుమిర్చి ఆవాలు మెంతులు మినప్పప్పు ఎర్రగా వేయించుకోవాలి
  4. అదే మూకుడులో కొద్దిగా నూనె వేసి ఆరిన గోంగూరని తడి పోయేవరకు వేయించాలి. తడి వుటే పచ్చడి పాడవుతుంది
  5. వేయించిన గోంగూరని...పచ్చడి పోపుని చింతపండుని ఉప్పును వేసిగ్రైండర్ లో లేదా రోట్లో మెత్తగా రుబ్బుకోవాలి
  6. ఇంగువ లేదా వెల్లుల్లిపాయలు ఎర్రగా నూనెలో వేయించి అదే నూనెలో ఈ పచ్చడి వేసుకోవాలి పచ్చడి రెడీ
  7. గోంగూర పచ్చడి లో ఇంగువ లేదా వెల్లుల్లిపాయలు ఏదో ఒకటి మాత్రమే వేసుకుంటే బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర