కొత్తిమీర పచ్చడి | Coriander chutney Recipe in Telugu

ద్వారా lakshmi kumari  |  28th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Coriander chutney recipe in Telugu,కొత్తిమీర పచ్చడి, lakshmi kumari
కొత్తిమీర పచ్చడిby lakshmi kumari
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    8

    జనం

0

0

కొత్తిమీర పచ్చడి వంటకం

కొత్తిమీర పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Coriander chutney Recipe in Telugu )

  • కొత్తిమీర .....1కట్ట
  • చింతపండు....నిమ్మకాయంత
  • ఉప్పు.... తగినంత
  • పసుపు ...1/2 టీ స్పూన్
  • బెల్లం...2 టీ స్పూన్లు
  • ఎండుమిర్చి...2
  • మెంతులు....1టీ స్పూను
  • ఆవాలు...1 టీ స్పూను
  • మినప్పప్పు....1టీ స్పూను
  • ఇంగువ....1/4 టీస్పూన్
  • నూనె.....1/4 కప్
  • ఎండుకారం...2టీ స్పూన్లు

కొత్తిమీర పచ్చడి | How to make Coriander chutney Recipe in Telugu

  1. ముందుగా కొత్తిమీరను బాగా కడిగి , నీరు లేకుండా వడకట్టాలి.
  2. ఇప్పుడు నీరులేకుండ చూసుకుని , కొత్తిమీర+ ఉప్పు+చింతపండు, మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి.
  3. పొయ్యిమీద మూకుడు పెట్టి, నూనె వేసి,నూనె వేడెక్కిన తర్వాత, ఎండుమిర్చి వేసి, పోపు గింజలు వేసి, వేగిన తర్వాత, ఇంగువ వేసి, వేగేక, రబ్బి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ వేసి, పసుపు వెయ్యాలి.
  4. నీరు ఇగిరినంత వరకు వేయించాలి.
  5. చల్లరేక గాజు సీసాలో వేసి , పెట్టుకుంటే, వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది.

నా చిట్కా:

ఈ పచ్చడి దోశల్లోకి, ఇడ్లీ లోకి, అన్నం లోకి కూడా బాగుంటుంది

Reviews for Coriander chutney Recipe in Telugu (0)