ఉల్లికాడల చట్నీ | Spring onion chutney Recipe in Telugu

ద్వారా Rashmi SudhiMurthy  |  29th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Spring onion chutney recipe in Telugu,ఉల్లికాడల చట్నీ, Rashmi SudhiMurthy
ఉల్లికాడల చట్నీby Rashmi SudhiMurthy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

About Spring onion chutney Recipe in Telugu

ఉల్లికాడల చట్నీ వంటకం

ఉల్లికాడల చట్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spring onion chutney Recipe in Telugu )

  • ఉల్లికాడలు 20
  • పచ్చి మిరపకాయలు 8
  • పచ్చి కొబ్బరి తురుము 1కప్
  • శెనగ పప్పు 2 టేబుల్ స్పూన్స్
  • జీలకర్ర 1/2 టీ స్పూన్
  • మెంతెలు 1/4 టీ స్పూన్
  • చింత పండు 1 చిన్న ముక్క
  • ఉప్పు రుచికి సరిపడా
  • నూనె 4 టేబుల్ స్పూన్స్
  • పసుపు చిటికెడు
  • నీళ్ళు తగినంత
  • పోపు (ఆవాలు,మినపప్పు, కరివేపాకు)

ఉల్లికాడల చట్నీ | How to make Spring onion chutney Recipe in Telugu

  1. ముందుగా ఉల్లికాడలు శుభ్రం చేసుకుని సన్నగా తరుగుకోవాలి
  2. ఒక పాన్ లో నూనె వేసుకొని అది వేడైన తరువాత అందులో శెనగపప్పు,జీలకర్ర,మెంతెలు వేసి ఫ్రై చేయాలి
  3. అవి వేగాక పచ్చిమిర్చి వేసి వేపాలి
  4. అందులో ఉల్లికాడ తరుగు వేసి ఫ్రై చేయాలి.
  5. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేసి ఒక సారి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి
  6. అది చల్లారాక మిక్సీ లో తగినంత నీళ్ళు పోసి బరకగా రుబ్బుకోవాలి
  7. చట్నీ ని ఒక గిన్నెలో తీసుకొని పోపు పెట్టుకొంటే ఉల్లికాడల చట్నీ రెడీ

Reviews for Spring onion chutney Recipe in Telugu (0)