పుచ్చకాయ తొక్కతో పచ్చడి | Watermelon rind weet and spicy chutney Recipe in Telugu

ద్వారా lakshmi kumari  |  29th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Watermelon rind weet and spicy chutney recipe in Telugu,పుచ్చకాయ తొక్కతో పచ్చడి, lakshmi kumari
పుచ్చకాయ తొక్కతో పచ్చడిby lakshmi kumari
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

0

పుచ్చకాయ తొక్కతో పచ్చడి వంటకం

పుచ్చకాయ తొక్కతో పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Watermelon rind weet and spicy chutney Recipe in Telugu )

 • పుచ్చకాయ ముక్కలు చేసి, ఎర్రటి గుజ్జును తీసేసి, ఆకుపచ్చగా ఉన్న తొక్క తీసేసి, మధ్యలో ఉన్న, వైట్ పదార్ధాన్ని కడిగి కోరుకోవాల ..1 కప్పు.
 • నూనె...11/2 పెద్ద స్పూన్లు
 • జీలకర్ర...1/ 2 టీ స్పూన్
 • ఎండుమిపకాయలు...2
 • ఎర్ర ఖారం ....1 టీ స్పూన్
 • అల్లం+ వెల్లుల్లి ముద్ద....1 పెద్ద చెంచా
 • ఉప్పు ...1టీ స్పూన్
 • పంచదార....1 టీ స్పూన్
 • నీరు......3/4 కప్

పుచ్చకాయ తొక్కతో పచ్చడి | How to make Watermelon rind weet and spicy chutney Recipe in Telugu

 1. ఒక నాన్ స్టిక్ పాన్ ని పొయ్యి మీద పెట్టి, నూనె వెయ్యాలి.
 2. నూనె వేడెక్కిన తరవాత, జీల కర్ర వేసి, జేల కర్ర వేెగేక, పొయ్యి మంట తగ్గించి, ఎండుమిర్చి ముక్కలు వేసి, 2 నిముషాలు వేయించాలి.
 3. ఇప్పుడు ఎండుఖారం వేసి, అల్లం, వెల్లుల్లి ముద్ద, వేసి 2 నిముషాలు వేయంచుకోవాలి.
 4. ఇప్పుడు కోరిపెట్టుకున్న (పుచ్చకాయ)ని వేసి, నీరు పోసి, పంచదార వేసి, వేయించి, మూత పెట్టాలి.
 5. పొయ్యి సిమ్ చేసి ఉంచాలి.
 6. ప్రతి నిమిషానికి కలుపుతూ ఉండాలి.
 7. నీరు అంతా ఇంకిపోయి, నూనె పాన్ ని వదిలేస్తుంది.
 8. ఇప్పుడు బౌల్ లోకి తీసుకోవాలి.
 9. రోటీ లోకి, అన్నం లోకి బాగుంటుంది.

నా చిట్కా:

వెల్లుల్లి వెయ్యకపోయిన బాగుంటుంది.

Reviews for Watermelon rind weet and spicy chutney Recipe in Telugu (0)