బొంబాయి చట్నీ | Bombay chutney Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  30th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bombay chutney recipe in Telugu,బొంబాయి చట్నీ, Sree Vaishnavi
బొంబాయి చట్నీby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

బొంబాయి చట్నీ వంటకం

బొంబాయి చట్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bombay chutney Recipe in Telugu )

  • ఉల్లిపాయ 1
  • టమాటో 1
  • పచ్చిమిర్చి 2
  • పసుపు చిటికెడు
  • సెనగపిండి 3 పెద్ద చెంచాలు
  • నీళ్లు 3 కప్పులు
  • ఉప్పు తగినంత
  • కరివేపాకు 1 రెమ్మ
  • కారం 1 చెంచా
  • ఆవాలు 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • మినపప్పు 1 చెంచా
  • సెనగపప్పు 1 చెంచా
  • ఎండుమిర్చి 2

బొంబాయి చట్నీ | How to make Bombay chutney Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె లో సెనగపిండి నీళ్లు పోసుకుని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి
  2. ఇప్పుడు ఒక పెద్ద మూకుడు తీసుకుని అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి
  3. నూనె వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు ,జీలకర్ర ,మినపప్పు ,సెనగపప్పు ,ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి
  4. వేగిన తరువాత అందులో పచ్చిమిర్చి ,ఉల్లిపాయ వేసి వేయించాలి
  5. అందులో టమాటో కూడా వేసుకోవాలి
  6. అవి వేగిన తరువాత అందులో పసుపు ,ఉప్పు, కారం వేసి వేయించాలి
  7. వాటిని ఒక నిమిషం వేగించిన తరువాత నీళ్లు పోసి ఒక పొంగు రానివ్వాలి
  8. అందులో ఇప్పుడు సెనగపిండి మిశ్రమం వేసి బాగా కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి

Reviews for Bombay chutney Recipe in Telugu (0)