మామిడికాయ నిల్వ పచ్చడి | Mango Pickle Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  1st Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Mango Pickle recipe in Telugu,మామిడికాయ నిల్వ పచ్చడి, Pravallika Srinivas
మామిడికాయ నిల్వ పచ్చడిby Pravallika Srinivas
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  60

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

0

0

మామిడికాయ నిల్వ పచ్చడి వంటకం

మామిడికాయ నిల్వ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mango Pickle Recipe in Telugu )

 • మామిడికాయ ముక్కలు - 1 kg
 • ఆవపిండి - 250 gms
 • మెంతి పిండి - 50gms
 • నువ్వుల నూనె - 1/2 kg
 • కారం - 300 gms
 • ఉప్పు - 300 gms
 • పొట్టు శనగలు - 50gms
 • వెల్లులి రెబ్బలు - 100gms

మామిడికాయ నిల్వ పచ్చడి | How to make Mango Pickle Recipe in Telugu

 1. ముందుగా గండుప్పు ,ఆవాలు ని యండలో పెట్టుకోవాలి .బాగా ఎండిన తర్వాత ఆవాలను మిక్సర్ జార్ లో పొడి కొట్టుకోవాలి. గండుప్పు ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.కొత్త కారం వేస్తే సంవత్సరం అంతా ఎర్రగా రుచిగా ఉంటుంది.మెంతులు ని కాలాయి లో వేయించి చల్లారిన తర్వాత పొడి సిద్ధం చేసుకోవాలి.
 2. మామిడికాయ ఆవకాయ కోసం మేము చిన్న రసాల రకం టెంక ఎక్కువ ఉంటుంది . ఈ పచ్చడి మే మొదటి 10 రోజులు లోపు వచ్చే కాయలు నిలవ పచ్చడి కి సరిఅయిన సమయం. ముందుగా మామిడికాయలు నీటిలో కడిగి పొడి బట్టతో శుభ్రంగా తడిలేకుండా తుడుచుకొని ఆరనివ్వాలి. మొదటి సారి రెండు భాగాలు చేసిన తర్వాత గింజ టెంకుకు ఉన్న పొట్టు కూడా స్పూన్తో తీసివేయాలి. ఇప్పుడు కాయ సైజు ని బట్టి అన్ని కాయలను సమానంగా ముక్కలుగా తరుగుకోవాలి.
 3. ఇప్పుడు ఒక వెడల్పాటి స్థంబాలం తీసుకొని ఉప్పు ,కారం ,ఆవపిండి మెంతిపిండి అన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తరిగిన మామిడికాయ ముక్కలు కూడా కొన్ని వేస్తూ ముక్కలకు అంటే విధంగా కలుపుకోవాలి .అన్ని కలిసిన తర్వాత నువ్వుల నూనె కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. ఇష్టం ఉన్న వారు పొట్టుసనగలు , వెల్లులి వలిచిన రెబ్బలు కూడా వేయవచ్చు. అన్ని కలిసిన తర్వాత ఒక డబ్బాలోకి తీసుకోవాలి.
 4. అలాకలిపిన పచ్చడి ని మూడు రోజులు ఊరానివ్వాలి. తర్వాత రోజు తిరగ కలుపుకోవాలి. మీరు ఆ పచ్చడి లో నూనె ఊట గమనిస్తారు .మామిడి ముక్కలకు ఉప్పు కారం బాగా పడుతుంది. సిద్ధంగా ఉన్న పచ్చడి ని పొడి జాడి లో భద్రపరుచుకోవాలి. అంతే రుచికరమైన మామిడికాయ నిలవ పచ్చడి రెడీ.

నా చిట్కా:

నిల్వ పచ్చడి కాబట్టి పాత్రలు & వాడే పదార్దాలు తడి లేకుండా చూసుకోవాలి.

Reviews for Mango Pickle Recipe in Telugu (0)