టమోటా పచ్చడి | Tomato pickle Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  2nd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tomato pickle recipe in Telugu,టమోటా పచ్చడి, Lalitha Kandala
టమోటా పచ్చడిby Lalitha Kandala
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

టమోటా పచ్చడి వంటకం

టమోటా పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato pickle Recipe in Telugu )

  • టమాటోలు 20
  • ఆవాలు ఒక చిన్న గ్లాసు
  • మెంతులు 3/4 గ్లాసు
  • ఉప్పు ఒక చిన్న గ్లాసు
  • కారం 3/4గ్లాస్
  • నూనె 1 చిన్న గ్లాస్
  • ఇంగువ కొద్దిగా

టమోటా పచ్చడి | How to make Tomato pickle Recipe in Telugu

  1. ముందుగా టమాటో లను బాగా కడిగి తడి లేకుండా తుడిచి కాసేపు ఆరనివ్వాలి.
  2. ఒక పాన్ లో ఆవాలు చిట పట మనేవరకు వేయించి చల్లారనివ్వండి
  3. అదే పాన్ లో మెంతులు కూడా వేసి కొద్దిగా ఎర్రగా వచ్చేవరకు వేయించి తీసి చల్లారనివ్వండి
  4. అదే పాన్ లో కొంచం నూనె వేసి టమోటాలు ముక్కలుగా కోసి వేయాలి
  5. ఉప్పు, పసుపు వేసి కాసేపు మగ్గనివ్వాలి
  6. తరువాత నిమ్మకాయ size లో చింతపండు వేయాలి
  7. దగ్గరపడి బాగా ఉడికాక దించి చల్లారనివ్వండి
  8. ఆవాలు, మెంతులు కలిపి మెత్తగా powder చేసుకోవాలి
  9. టమోటా ముక్కలు చల్లారాక అందులో ఈ powder, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి.
  10. ఒక గిన్నెలో కొంచం నూనె కాచి అందులో ఇంగువ వేసి చల్లారాక పచ్చడిలో వేసి బాగా కలపాలి.
  11. మిగతా నూనె కూడా వేసి కావాలంటే ఆవాలు, కరివేపాకు పోపు పెట్టుకోవచ్చు.

నా చిట్కా:

పచ్చళ్లకు, ఊరగాయలకు నువ్వుల నూనె వాడితే రుచిగా ఉంటుంది.

Reviews for Tomato pickle Recipe in Telugu (0)