గోంగూర ఉల్లిపాయలు పచ్చడి | GONGURA ullipaya pachadi Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  2nd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • GONGURA ullipaya pachadi recipe in Telugu,గోంగూర ఉల్లిపాయలు పచ్చడి, Kavitha Perumareddy
గోంగూర ఉల్లిపాయలు పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

0

0

గోంగూర ఉల్లిపాయలు పచ్చడి వంటకం

గోంగూర ఉల్లిపాయలు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make GONGURA ullipaya pachadi Recipe in Telugu )

  • గోంగూర రెండు కట్టలు
  • పచ్చిమిర్చి 10
  • ఉల్లిపాయలు 2
  • జీలకర్ర స్పున్
  • నూనె 3 స్పూన్స్
  • పోపుగింజలు స్పున్
  • ఎండుమిర్చి పోపుకు 2
  • వెల్లుల్లి రెబ్బలు 6
  • కరివేపాకు కొద్దిగా
  • ఉప్పు తగినంత

గోంగూర ఉల్లిపాయలు పచ్చడి | How to make GONGURA ullipaya pachadi Recipe in Telugu

  1. ముందుగా గోంగూర శుభ్రంగా వలిచి ఉప్పునీటిలో వేసి బాగా కడిగి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి జీలకర్ర వేసి వేగినాక పచ్చిమిర్చి వేసి మగ్గించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి.
  3. మళ్ళీ అదే బాండీలో స్పున్ నూనె వేసి గోంగూర వేసి బాగా నీరంతా పోయే వరకు మగ్గించాలి.
  4. ఇప్పుడు ముందుగా రోటిలో పచ్చిమిర్చి, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి దంచుకోవాలి. తరువాత ఉల్లిపాయలు వేసి దంచుకోవాలి.ఉల్లిపాయలు పచ్చివే వేసుకోవాలి.
  5. ఉల్లిపాయలు నలిగిన తరువాత మగ్గించిన గోంగూర వేసి అంతా కలిసేలా నూరుకోవాలి.
  6. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె, పోపుగింజలు,ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసి పోపు పట్టుకోవాలి.అంతే ఇంకా పచ్చడి రెడీ.

Reviews for GONGURA ullipaya pachadi Recipe in Telugu (0)