హోమ్ / వంటకాలు / గోంగూర ఉల్లిపాయలు పచ్చడి

Photo of GONGURA ullipaya pachadi by Kavitha Perumareddy at BetterButter
785
3
0.0(0)
0

గోంగూర ఉల్లిపాయలు పచ్చడి

Oct-02-2018
Kavitha Perumareddy
20 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోంగూర ఉల్లిపాయలు పచ్చడి రెసిపీ గురించి

ఈ పచ్చడి వేడివేడి అన్నంలో,ఇంకా రొట్టెలు లోకి చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 6

  1. గోంగూర రెండు కట్టలు
  2. పచ్చిమిర్చి 10
  3. ఉల్లిపాయలు 2
  4. జీలకర్ర స్పున్
  5. నూనె 3 స్పూన్స్
  6. పోపుగింజలు స్పున్
  7. ఎండుమిర్చి పోపుకు 2
  8. వెల్లుల్లి రెబ్బలు 6
  9. కరివేపాకు కొద్దిగా
  10. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా గోంగూర శుభ్రంగా వలిచి ఉప్పునీటిలో వేసి బాగా కడిగి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి జీలకర్ర వేసి వేగినాక పచ్చిమిర్చి వేసి మగ్గించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి.
  3. మళ్ళీ అదే బాండీలో స్పున్ నూనె వేసి గోంగూర వేసి బాగా నీరంతా పోయే వరకు మగ్గించాలి.
  4. ఇప్పుడు ముందుగా రోటిలో పచ్చిమిర్చి, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి దంచుకోవాలి. తరువాత ఉల్లిపాయలు వేసి దంచుకోవాలి.ఉల్లిపాయలు పచ్చివే వేసుకోవాలి.
  5. ఉల్లిపాయలు నలిగిన తరువాత మగ్గించిన గోంగూర వేసి అంతా కలిసేలా నూరుకోవాలి.
  6. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె, పోపుగింజలు,ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసి పోపు పట్టుకోవాలి.అంతే ఇంకా పచ్చడి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర