మామిడికాయ దోసకాయ పచ్చడి | MANGO cucumber pickle Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  2nd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • MANGO cucumber pickle  recipe in Telugu,మామిడికాయ దోసకాయ పచ్చడి, Kavitha Perumareddy
మామిడికాయ దోసకాయ పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

మామిడికాయ దోసకాయ పచ్చడి వంటకం

మామిడికాయ దోసకాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make MANGO cucumber pickle Recipe in Telugu )

  • మామిడికాయ 1
  • దోసకాయ 1
  • ఎండుమిర్చి 15
  • జీలకర్ర స్పున్
  • ధనియాలు స్పున్
  • మినప్పప్పు స్పున్
  • సెనగపప్పు స్పున్
  • నూనె 2 స్పూన్స్
  • వెల్లుల్లి 6 రెబ్బలు
  • కరివేపాకు కొద్దిగా
  • పోపుగింజలు స్పున్
  • ఉప్పు తగినంత

మామిడికాయ దోసకాయ పచ్చడి | How to make MANGO cucumber pickle Recipe in Telugu

  1. ముందుగా మామిడికాయ, దోసకాయ లు చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పూన్ నూనె వేసి జీలకర్ర, ధనియాలు, మినప్పప్పు, సెనగపప్పు, వేసి వేగినాక ఎండుమిర్చి వేసి వేపుకోవాలి.కరివేపాకు కూడా కొద్దిగా వేసి వేపుకోవాలి.
  3. ఇప్పుడు రోటిలో ముందుగా ఎండుమిర్చి, వేయించిన పోపు ,తగినంత ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి.
  4. తరువాత మామిడి ముక్కలు దంచుకోవాలి. తరువాత దోసకాయముక్కలు కూడా వేసి అంతా కలిపి దంచుకోవాలి.
  5. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి పోపుగింజలు,వెల్లుల్లి,కరివేపాకు వేసి పోపు వేగనిచ్చి దంచిన పచ్చడి వేసి కలిపి కాసేపు మగ్గించుకోవాలి. అంతే ఇంకా మామిడికాయ, దోసకాయ పచ్చడి రెడీ.

నా చిట్కా:

పచ్చడి మరీ మెత్తగా దంచుకోకూడదు .కచపచ్చగా దంచుకోవాలి. అప్పుడే రుచిగా ఉంటుంది.

Reviews for MANGO cucumber pickle Recipe in Telugu (0)