హోమ్ / వంటకాలు / ఉల్లి, వెల్లుల్లి పచ్చడి

Photo of Onion garlic chutney  by Kavitha Perumareddy at BetterButter
268
2
0.0(0)
0

ఉల్లి, వెల్లుల్లి పచ్చడి

Oct-02-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లి, వెల్లుల్లి పచ్చడి రెసిపీ గురించి

ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయదు అంటారు.అంత పోషకాలు వున్నాయి.రోజు ఒక ఉల్లిగడ్డ తింటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. అలాగే మజ్జిగ అన్నంలో తింటే చలువ చేస్తుంది.అదే విధంగా వెల్లుల్లి కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లి హార్ట్ కు మంచిది బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగించి హార్ట్ కు రక్తప్రసరణ సరిగా వుండేలా చేస్తుంది.అలాగే వాతాన్ని హరించి శరీర నొప్పులు తగ్గిస్తుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 5

  1. ఉల్లిగడ్డ లు 4
  2. వెల్లుల్లి 2 గడ్డలు
  3. ఎండుమిర్చి 10
  4. ధనియాలు స్పున్
  5. నూనె 2 స్పూన్స్
  6. పోపుగింజలు స్పున్
  7. కరివేపాకు కొద్దిగా
  8. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా ఉల్లిగడ్డ లు తరిగిపెట్టుకోవాలి .వెల్లుల్లి పొట్టు తీసిపెట్టుకోవాలి. మిగతా వస్తువులు రెడీగా పెట్టుకోవాలి
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి కొద్దిగా నూనె వేసి ధనియాలు, ఎండుమిర్చి వేసి వేపుకొని పక్కకు తీసిపెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండీలో కొద్దిగా నూనె వేసి ముందుగా వెల్లుల్లిని వేసుకొని వేపి తరువాత ఉల్లిగడ్డ ముక్కలు చిటికెడు ఉప్పు వేసి మగ్గించాలి.5 నిముసాలు సరిపోతుంది.
  3. ఇప్పుడు రోటిలో ముందుగా ఎండుమిర్చి ,ధనియాలు, తగినంత ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి.
  4. తరువాత ఉల్లిగడ్డ, వెల్లుల్లి వేసి అంతా కలిసేలా దంచుకోవాలి.
  5. తరువాత పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి పోపుగింజలు,కరివేపాకు ను వేసి పోపు వేగనిచ్చి పచ్చడిలో కలపాలి.పోపు వేయకున్న పరవాలేదు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర