గోంగూర నువ్వుల పచ్చడి | GONGURA NUVVULA PACHADI Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  4th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • GONGURA NUVVULA PACHADI recipe in Telugu,గోంగూర నువ్వుల పచ్చడి, రమ్య వూటుకూరి
గోంగూర నువ్వుల పచ్చడిby రమ్య వూటుకూరి
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

గోంగూర నువ్వుల పచ్చడి వంటకం

గోంగూర నువ్వుల పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make GONGURA NUVVULA PACHADI Recipe in Telugu )

  • గోంగూర 5 కట్టలు
  • ఆయిల్ 1/2 కప్
  • ఉల్లిపాయ ముక్కలు 1 కప్
  • నువ్వులు 3 టేబుల్ స్పూన్స్
  • ఎండుమిర్చి 10
  • పొట్టు మినప్పప్పు 2 స్ఫూన్స్
  • ఉప్పు తగినంత

గోంగూర నువ్వుల పచ్చడి | How to make GONGURA NUVVULA PACHADI Recipe in Telugu

  1. గోంగూర శుభ్రంగా కడగాలి
  2. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి కొంచం ఆయిల్ వేసి మినప్పప్పు ఎండుమిర్చి నువ్వులు వేసి దోరగా వేయించాలి
  3. వీటిని మిక్సీ జార్ లోకి తీస్కొని పొడి చేసుకోవాలి
  4. అదే బాండీ లో కొంచం ఆయిల్ వేసి గోంగూర వేసి మగ్గించుకోవాలి
  5. గోంగూర చల్లారాక, దీన్ని మిక్సీ జార్లోకి తీస్కొని ఉప్పువెస్కొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి
  6. మరీ మెత్తగా చేసుకోవద్దు
  7. వేరొక బాండీ లో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా వేపి పచ్చడిలో కలుపుకొంటె గోంగూర నువ్వుల పచ్చడి సిద్ధం

Reviews for GONGURA NUVVULA PACHADI Recipe in Telugu (0)