ఉల్లిపాయ తీపి పచ్చడి | Onion sweet chutney Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  5th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Onion sweet chutney recipe in Telugu,ఉల్లిపాయ తీపి పచ్చడి, రమ్య వూటుకూరి
ఉల్లిపాయ తీపి పచ్చడిby రమ్య వూటుకూరి
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

ఉల్లిపాయ తీపి పచ్చడి వంటకం

ఉల్లిపాయ తీపి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Onion sweet chutney Recipe in Telugu )

  • ఉల్లిపాయలు 4
  • ఎండుమిర్చి 20
  • బెల్లం 2 స్పూన్స్
  • ఉప్పు తగినంత
  • మెంతులు 1 స్పూన్
  • ధనియాలు 3 టేబుల్ స్పూన్స్
  • ఆయిల్ 1/2 కప్
  • చింతపండు నిమ్మకాయంత
  • పసుపు చిటికెడు
  • పోపుగింజలు 1 స్పూన్
  • ఇంగువ 1/2 స్పూన్
  • వెల్లుల్లి 10

ఉల్లిపాయ తీపి పచ్చడి | How to make Onion sweet chutney Recipe in Telugu

  1. ఉల్లిపాయలు కడిగి ముక్కలుగా చేసుకోవాలి
  2. చింతపండు గుజ్జు తీస్కొని పెట్టుకోవాలి
  3. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి
  4. ఆయిల్ వేడెక్కాక ధనియాలు మెంతులు ఎండుమిర్చి వేసి దోరగా వేపాలి
  5. వీటిని మిక్సీ జార్లోకి తీస్కొని చల్లారాక మెత్తగా పొడి చేసుకోవాలి
  6. బాండీ లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి.
  7. ఉల్లిపాయలు వేగాక చింతపండు గుజ్జు కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడకబెట్టాలి.
  8. దీనిలో తయారు చేసుకొని పొడి బెల్లం కూడా వేసి కొంచం వాటర్ పొసి బాగా ఉడకనివ్వాలి.
  9. ఆయిల్ తేలేవరకు ఉడకబెట్టికొని స్టవ్ ఆఫ్ చేస్కోవాలి. చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకొని ఉంచాలి
  10. వేరే బాండీ తీస్కొని మిగతా ఆయిల్ వేసి పోపు గింజలు ఇంగువ వెల్లుల్లి తో పోపు వేసుకొవాలి
  11. పోపులో పచ్చడి కాసేపు వేగితే ఉల్లిపాయ తీపి చట్నీ రెడి

Reviews for Onion sweet chutney Recipe in Telugu (0)