క్యాబేజీ పచ్చడి | Cabbage Pickle Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  5th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Cabbage Pickle recipe in Telugu,క్యాబేజీ పచ్చడి, Tejaswi Yalamanchi
క్యాబేజీ పచ్చడిby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

క్యాబేజీ పచ్చడి వంటకం

క్యాబేజీ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cabbage Pickle Recipe in Telugu )

  • తరిగిన క్యాబేజీ : 500 గ్రాములు
  • నూనె : 1 చిన్న కప్పు
  • ఆవాలు : 1/2 టీస్పూన్
  • జీలకర్ర : 1/2 టీస్పూన్
  • పచ్చిశనగపప్పు : 2 టీస్పూన్లు
  • ఉప్పు : సరిపడా లేదా 5 చెంచాలు
  • కారం : 10 చెంచాలు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ : 4 చెంచాలు
  • ఎండు మిరపకాయలు : 4
  • కర్వేపాకు : 1 రెమ్మ
  • జీలకర్ర పొడి : 1/2 చెంచా
  • మెంతుల పొడి : 1/2 చెంచా
  • ఆవ పొడి : 2 చెంచాలు
  • నిమ్మరసం : 15 చెంచాలు

క్యాబేజీ పచ్చడి | How to make Cabbage Pickle Recipe in Telugu

  1. ముందుగా తరిగిన క్యాబేజీ తీసుకొని చక్కగా కడిగి పొడిగుడ్డతో తుడిచి పక్కన పెట్టుకోండి
  2. నిమ్మరసం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి
  3. ఎండు మిరపకాయలు ఆవపొడి జీలకర్ర పొడి మెంతుల పొడి తీసుకోండి
  4. పోయి మీద బాండీ పెట్టుకొని అది వేడెక్కాక నూనె పోసి అది కాగాక జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు వేసి వేయించండి
  5. ఆ తర్వాత ఎండు మిరపకాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి
  6. పోపు తయారు ఇంకా బండి పోయి మీద నుంచి కిందకు దించండి
  7. ఇప్పుడు దాంట్లో ఉప్పు కారం ఆవ పొడి మెంతుల పొడి జీలకర్ర పొడి నిమ్మరసం వేసి బాగా కలపండి
  8. ఇప్పుడు దాంట్లో ముక్కలుగా చేసుకున్న క్యాబేజీ ముక్కలు వేసి ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టండి
  9. రెండు గంటల తర్వాత చూస్తే నూనె ఉరి ఇలా కనిపిస్తుంది
  10. అంతే క్యాబేజీ పచ్చడి తయారు.

నా చిట్కా:

తడి లేని డబ్బాలో పచ్చడి దాచుకుంటే వారం రోజుల పైన వరకే ఉంటుంది

Reviews for Cabbage Pickle Recipe in Telugu (0)