ముల్లంగి పచ్చడి | Raddish chutney Recipe in Telugu

ద్వారా lakshmi kumari  |  5th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Raddish chutney recipe in Telugu,ముల్లంగి పచ్చడి, lakshmi kumari
ముల్లంగి పచ్చడిby lakshmi kumari
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

ముల్లంగి పచ్చడి వంటకం

ముల్లంగి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Raddish chutney Recipe in Telugu )

  • ముల్లంగి ముక్కలు... ఒక కప్పు
  • ఆకులు కూడా కడిగి పెట్టుకోవాలిपत्ते को भी धोकर काट लीजिये---
  • పసుపు....చిటికెడు
  • చింతపండు...చిన్న నిమ్మకాయంత
  • ఎండుమిర్చి.....5
  • మెంతులు..1/2టీ స్పూను
  • ఆవాలు...1/2టీ స్పూను
  • జీలకర్ర ..1/2టీ స్పూను
  • మినప్పప్పు ...1/2 టీ స్పూను
  • ఇంగువ......చిటికెడు
  • ఉప్పు....1 టీ స్పూను
  • పంచదార....చిటికెడు
  • వెల్లుల్లి రెమ్మలు...4

ముల్లంగి పచ్చడి | How to make Raddish chutney Recipe in Telugu

  1. ముల్లంగి శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకోవాలి, ముల్లంగి ఆకులు కూడా శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకోవాలి.
  2. ఇప్పుడు పొయ్యి పైన బాణలి పెట్టి నూనె వేసుకోవాలి.
  3. నూనె వేడెక్కిన తరువాత,బాణలిలో ముల్లంగి ముక్కలు, ముల్లంగి ఆకులు వేసి వేయించుకోవాలి.
  4. వేగిన ముల్లంగి ముక్కల్ని, ఆకులని తీసి పక్కన పెట్టుకోవాలి.
  5. అదే బాణలిలో నూనె వేసి, నూనె వేడెక్కిన తరువాత, ఎండుమిర్చి,పోపు గింజలు వేయించుకోవాలి., ఇంగువ కూడా వేసి వేయించాలి.
  6. ఇప్పుడు వేయించినవన్నీ చల్లారినివ్వాలి.
  7. మిక్సీ పాట్ లో ముందుగా పోపు గింజలు ఎండుమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  8. ఇప్పుడు చింతపండు,ఉప్పు, పసుపు వేసి మళ్లీ గ్రైండ్ చేయాలి.
  9. ఇప్పుడు వేయించిపెట్టుకున్న ముక్కలు , ఆకులు వేసి, చిటికెడు పంచదార కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
  10. వేయాల్సి వస్తే కొంచెం నీరు వేసి గ్రైండ్ చేయండి
  11. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసి వెల్లుల రెమ్మలు ఆవాలు వేయించి కలుపుకోండి.

నా చిట్కా:

ఆరోగ్యానికి చాలా మంచిది.

Reviews for Raddish chutney Recipe in Telugu (0)