హోమ్ / వంటకాలు / కాకరకాయ పచ్చిమిర్చి పచ్చడి

Photo of Bitter gourd green chilli chutney by Kavitha Perumareddy at BetterButter
502
0
0.0(0)
0

కాకరకాయ పచ్చిమిర్చి పచ్చడి

Oct-05-2018
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకరకాయ పచ్చిమిర్చి పచ్చడి రెసిపీ గురించి

ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చేదు అస్సలు ఉండదు.పచ్చిమిర్చి, చింతపండు అన్నీ వేసి చేస్తాం కదా అందుకే చేదు ఉండదు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 5

  1. కాకరకాయలు 4
  2. పచ్చిమిర్చి 10
  3. చింతపండు నిమ్మకాయ సైజ్
  4. జీలకర్ర స్పున్
  5. నూనె 2 స్పూన్స్
  6. ఉప్పు తగినంత
  7. వెల్లుల్లి 10 రెబ్బలు
  8. కరివేపాకు కొద్దిగా
  9. కొత్తిమీర గుప్పెడు
  10. పోపుగింజలు స్పున్
  11. ఎండుమిర్చి పోపుకు 2

సూచనలు

  1. ముందుగా కాకరకాయలు కడిగి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి.పచ్చిమిర్చి కడిగి పెట్టుకోవాలి. మిగతా అన్ని వస్తువులు రెడీగా పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు రోటిలో ముందుగా కాకరకాయ ముక్కలు వేసి దంచుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి.మరీ మెత్తగా దంచకూడదు పలుకులుగా ఉండాలి.
  3. తరువాత దంచుకున్న కాకరను పక్కకు తీసుకొని రోటిలో పచ్చిమిర్చి, చింతపండు, వేసి మెత్తగా దంచుకోవాలి.
  4. తరువాత జీలకర్ర, వెల్లుల్లి ఇంకొంచెం ఉప్పు వేసి దంచుకోవాలి.
  5. తరువాత కొత్తిమీర,ముందుగా దంచిన కాకరకాయ అంతా వేసి కలిగేలా దంచుకోవాలి.పచ్చడి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
  6. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి పోపుగింజలు,ఎండుమిర్చి, కరివేపాకుతో పోపు వేసి వేగినతరువత పచ్చడి వేసుకోవాలి.
  7. పచ్చడి పోపులో కలిసేలా కలిపి 5 నిముసాలు మగ్గించాలి. అంతే పచ్చడి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర